E-Paper
Advertisement

Kalki 2898 AD: కల్కి డిలిటెడ్ సీన్స్.. డిలీట్ చేయడమే బెటర్ అన్నట్టు ఉన్నాయే

Kalki 2898 AD: కల్కి డిలిటెడ్ సీన్స్.. డిలీట్ చేయడమే బెటర్ అన్నట్టు ఉన్నాయే
Advertisement

Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో కనిపించగా.. విశ్వనటుడు కమల్ హాసన్ విలన్ గా కనిపించాడు.

ఇక  దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ , మాళవిక నాయర్ గెస్ట్ పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ ఏడాది జూన్ 26 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. రికార్డు కలక్షన్స్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన కల్కి.. ఈ మధ్యనే ఓటీటీలో కూడా అడుగుపెట్టి ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది.

Advertisement

ఇక ప్రతి సినిమాకు కట్ చేసిన సీన్స్ ఉంటాయి. వాటిని సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకు రిలీజ్ చేయడం ట్రెండ్ గా మారింది. తాజాగా కల్కి డీలిటెడ్ సీన్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో అశ్వద్ధామ, రాయ మధ్య సీన్స్, కాంప్లెక్స్ సంబంధించిన కొన్ని సీన్స్ ను చూపించారు. నిజం చెప్పాలంటే.. ఈ డీలిటెడ్ సీన్స్ వలన ఎలాంటి ఉపయోగం లేదని తెలుస్తోంది.

మొదటి నుంచి కల్కి సినిమా ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపించిందని మౌత్ టాక్ వచ్చిన విషయం తెల్సిందే. ఇక ఈ డీలిటెడ్ సీన్స్ కూడా యాడ్ చేస్తే.. మరింత ల్యాగ్ అయ్యి  మిక్స్డ్ టాక్ వచ్చేది ఏమో అని అనిపించకమానదు. ఏదిఏమైనా ఈ సీన్స్ ను డిలీట్ చేసి మంచి పనే చేసారని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Advertisement

అయితే ఈ సీన్స్ లో శోభన ఫైట్ సీక్వెన్స్.. సినిమాలో పెట్టి ఉంటే బావుండేది అని అనిపించకమానదు. అమ్మను కాపాడుకోవడానికి మరియమ్.. సుప్రీమ్ యాస్కీన్ మనుషులతో ఫైట్ చేస్తుంది. దాన్ని మొత్తం చూపించకుండా కట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఒక్క సీన్ తప్ప మిగతావన్నీ వేస్ట్ అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక అసలు ఆ సీన్స్ ఏంటి అనేవి మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×