BigTV English

Ajwain Health Benefits: వాముతో చిటికెలో జలుబు, దగ్గు మాయం !

Ajwain Health Benefits: వాముతో చిటికెలో జలుబు, దగ్గు మాయం !

Ajwain Health Benefits: వంటల్లో ఎక్కువగా ఉపయోగించే పదార్థాల్లో వాము కూడా ఒకటి. దీనిని కొందరు ఓమ అని కూడా పిలుస్తుంటారు. ఈ గింజలు వంటలకు సువాసనను అందించడమే కాకుండా వంటకాల రుచిని కూడా రెట్టింపు చేస్తాయి. ఇదిలా ఉంటే అనేక అనారోగ్య సమస్యలను కూడా వాము నయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాము తినడం వల్ల అరుగుదల, గ్యాస్, ఎసిడిటీ, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అని అంటున్నారు.


పాస్పరస్, కాల్షియం వంటివి వాములో పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఫ్యాటీయాసిడ్లు, ఫైబర్, ప్రోటీన్లు కలిగి ఉండే వాము నేరుగా తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వాము నీళ్లను తాగినా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్న వామును రోజు వారి ఆహార పదార్థాల్లో చేర్చుకుంటే జీర్ణ సమస్యలు నయమవుతాయి.

జలుబు, దగ్గులు మాయం:
ముక్కు, గొంతులో పేరుకుపోయిన లేదా అడ్డుకున్న శ్లేష్మాన్ని క్లియర్ చేసే సామర్థ్యాన్ని వాము కలిగి ఉంటుంది. ఊపిరితిత్తులకు గాలి ప్రసరణను కూడా ఇది సులభతరం చేస్తుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారు వాము తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వాము నీటిని తాగడం వల్ల కూడా జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం లభిస్తుంది.


ఆరోగ్యకరమైన కొవ్వులు:
డైటరీ ఫైబర్ కొవ్వు ఆమ్లాలు, వాము గింజల్లో అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాలను తగ్గించి మంచి కొలస్ట్రాల్‌ను పెంచుతుంది. రక్తంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు గుండెపోటు వంటి జబ్బులతో సహా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. వీటి నుంచి తప్పించుకునేందుకు వాము గింజలు మీకు ఎంతో సహాయపడతాయి.

రక్తపోటు నియంత్రణ:
థైమోల్ వాము గింజల్లో పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. గుండె కణాలు, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ చేరకుండా అడ్డుకుని రక్తపోటును ఇది తగ్గిస్తుంది.

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు:
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాము గింజల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి తరచుగా తినడం వల్ల శరీరంలో దీర్ఘకాలికంగా వచ్చే కాళ్ల మంట , వాపులను తగ్గించుకోవచ్చు . అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.

జీర్ణక్రియ:
జీర్ణాశయంలో ఏర్పడే అన్ని సమస్యలకు ఇంటి దగ్గరే వాముతో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్రియాశీల ఎంజైములు, గ్యాస్ట్రిక్ రసాల ప్రవాహాన్ని వాము ప్రోత్సహిస్తుంది. కడుపుబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి వాటిని తగ్గిస్తుంది. పేగుల ఆరోగ్యానికి కూడా వాము ఎంతో మేలు చేస్తుంది. పిల్లలకు కడుపునొప్పి రాకుండా వామనీటిని కూడా తాగిస్తుంటారు. వాము తినడం వల్ల బాలింతల్లో పాల ఉత్పత్తి కూడా పెరుగుతుందని ఆయుర్వేదిక నిపుణులు చెబుతున్నారు.

Also Read: రాగులతో ఈ అనారోగ్య సమస్యలు పరార్ !

పీరియడ్స్ నొప్పి మాయం:
వాము నీరు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. కడుపునొప్పి, అజీర్తి సమస్యలను కూడా నయం చేసే శక్తిని వాము కలిగి ఉంటుంది. ఆహారంలో భాగంగా వామును చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అనేక అనారోగ్య సమస్యలకు ఇది ఔషధంగా పని చేస్తుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×