E-Paper
Advertisement

Disha Patani: దిశా ఒంటిపై ప్రభాస్ టాటూ.. కొత్త వదినమ్మ వచ్చేసిందా.. ?

Disha Patani: దిశా ఒంటిపై ప్రభాస్ టాటూ.. కొత్త వదినమ్మ వచ్చేసిందా.. ?
Advertisement

Disha patani latest news(Celebrity news today): పాన్ ఇండియా ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ప్రభాస్ సినిమాలతో పాటు అతని పెళ్లి గురించి కూడా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభాస్ పెళ్లి వార్త చెప్తాడా..? అని ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఇండస్ట్రీలో హీరోలకు రూమర్స్ కొత్తేమి కాదు. హీరోయిన్ తో కొద్దిగా క్లోజ్ గా ఉన్నా వారిద్దరి మధ్య ఏదో ఉందని గాసిప్స్ పుట్టుకొచ్చేస్తాయి. అందుకు ప్రభాస్ కూడా అతీతమేమి కాదు. మొదట ప్రభాస్ – అనుష్క మధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు వచ్చాయి.

Advertisement

నిజం చెప్పాలంటే వారు పెళ్లి చేసుకుంటే బావుంటుందని అభిమానులే కాదు.. నెటిజన్స్ కూడా అభిప్రాయపడ్డారు. కానీ, తామిద్దరి మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే అని వారు చెప్పుకొచ్చారు. అయినా ఇప్పటికీ ఏదో ఒక మూల వీరి పెళ్లి జరిగితే బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ కథ ముగిసాక.. ఆదిపురుష్ సినిమా సమయంలో ప్రభాస్ – కృతి సనన్ మధ్య ఏదో నడుస్తుందని వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో వదినమ్మ ఆమె అని ప్రభాస్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

రాముడికి తగ్గ సీత.. అన్నకు తగ్గ వదిన అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేశారు. ఇక ఇది కూడా ప్రభాస్ కొట్టిపడేశాడు. అలాంటివేం లేవని తేల్చి చెప్పడంతో ఆ ఆశలు కూడా అడియాశలు అయ్యాయి. ఇక ఇప్పుడు కొత్తగా మరో వదినమ్మ వచ్చి చేరింది. ఆమె దిశా పటానీ. వీరిద్దరూ కలిసి కల్కి సినిమాలో నటించారు. ఇక మునుపెన్నడూ లేని విధంగా.. దిశా చేతిపై సడెన్ గా ఒక టాటూ ప్రత్యేక్షమయ్యింది.

Advertisement

PD అనే అక్షరాలతో ఆ టాటూ.. దిశా చేతిపై మెరవడం కొత్త అనుమానాలకు తెరతీసింది. కల్కి రిలీజ్ కు ముందు వరకు దిశా చేతిపై ఇలాంటి ఒక టాటూ లేదు. అయితే ఏ మధ్యనే ఈ టాటూ వేయించుకొని ఉండాలి. P అంటే ప్రభాస్.. D అంటే దిశా అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. గత కొన్నిరోజులుగా ప్రభాస్ పై దిశా ఎనలేని ప్రేమను చూపిస్తోంది. అందుకే వీరి మధ్య ఏదో ఉందని నెటిజన్స్ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే దిశా నోరు విప్పి.. ఆ P ఎవరు అనేది చెప్పాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×