BigTV English

Kalki 2898 AD Collections: విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్ల వర్షం.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్ల వసూళ్లంటే..?

Kalki 2898 AD Collections: విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్ల వర్షం.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్ల వసూళ్లంటే..?

Prabhas Kalki 2898 AD Collections(Latest news in tollywood): ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టాలీవుడ్‌లో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. ఇది టాలీవుడ్ ఆ.. లేక హాలీవుడ్ ఆ.. అనే రేంజ్‌ తెప్పించాడు. అతడు సృష్టించిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచం బాక్సాఫీసు వద్ద దండయాత్ర చేస్తుంది. జూన్ 27న గ్రాండ్‌ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఊహకందని విజువల్ ఎఫెక్ట్స్‌తో సినీ ప్రియుల్ని ఫిదా చేసింది. నిజంగా ఒక టాలీవుడ్ దర్శకుడిలో ఇలాంటి క్రియేటివిటీ ఉండటం యావత్ తెలుగు సినీ ప్రేక్షకుల్లో సరికొత్త ఆనందాన్ని నింపింది.


ఇంత వరకు అలాంటి విజువల్స్ ఎఫెక్ట్స్ సినిమాలను కేవలం హాలీవుడ్ నుంచి మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్లు. కానీ ‘కల్కి’ మూవీతో అందరికీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు హాలీవుడ్డే కాదు.. టాలీవుడ్ కూడా అదే రేంజ్ సినిమాలు తీయగలదు అనే నమ్మకం కలిగింది. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు నాగ్ అశ్విన్‌కే దక్కుతుంది. అలాగే బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు.

 Also Read: శరవేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి ‘కల్కి’.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్


ఈ మూవీలో ప్రభాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కటౌట్‌కి తగ్గ యాక్షన్, యాక్షన్‌కు తగ్గ విజువల్స్‌తో సినిమా రేంజే మారిపోయింది. దీంతో ఫస్ట్ డే నుంచే కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ మూవీ తొలి రోజు రూ.191.5 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. రెండు రోజుల్లో రూ.298.5 వసూళ్లు నమోదు చేసింది. ఇక మూడు రోజుల్లో 415 కోట్లు రాబట్టగా.. నాలుగు రోజుల్లో రూ.555 కోట్లు వసూళ్లు చేసి దుమ్ము దులిపేసింది. ఇక ఐదో రోజుకు వచ్చే కల్కి మూవీ బాక్సాఫీసు వద్ద అదరగొట్టేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా బాక్సాఫీసు వద్ద రూ.625 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి దుమ్ము దులిపేసింది.

అయితే తెలుగు, హిందీలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా కల్కి తన హవా చూపిస్తోంది. హిందీలో సోమవారానికి రూ.20 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అంతేకాకుండా ఉత్తర భారతదేశంలో హిందీ వెర్షన్ ఇప్పటి వరకు రూ.135 కోట్లు రాబట్టి అబ్బురపరచింది. తాజాగా ఈ మూవీ కలెక్షన్లలో మరొక ఘనత అందుకుంది. ఉత్తర అమెరికాలో $12 మిలియన్లను దాటేసింది. అలాగే అదే ప్రాంతంలో అత్యంత స్పీడ్‌గా రూ.100 కోట్ల గ్రాస్‌ను నమోదు చేసింది. దీంతో ఈ ప్రాంతంలో అత్యంత వేగంగా ఇంత పెద్ద మొత్తంలో ఇంతటి గ్రాస్‌ను నమోదు చేసిన భారతీయ సినిమా ఇదేనని అంటున్నారు. ఇక ఈ మూవీ త్వరలో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరబోతుందని ట్రేడ్ నిపుణులు చెప్పుకొస్తున్నారు.

Tags

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×