E-Paper
Advertisement

Nag Ashwin: కల్కి డైరెక్టర్ కూడా మన కులపోడేరా.. ఆ సినిమా కోసమే వెయిటింగ్ అంట

Nag Ashwin: కల్కి డైరెక్టర్ కూడా మన కులపోడేరా.. ఆ సినిమా కోసమే వెయిటింగ్ అంట
Advertisement

Nag Ashwin: స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొబైల్ ఫోన్ తప్ప మహాభారతం గురించి తెలియని యువతను.. ఒక్క కల్కి సినిమాతో మహాభారతాన్ని చదివించేలా చేశాడు. ఎన్నో ఏళ్లుగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న విజయాన్ని వారికి అందించాడు. ప్రభాస్ కెరీర్ లో మరో మైలు రాయిని చేరుకునేలా చేశాడు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరిని మర్చిపోయినా.. రాజమౌళి తరువాత నాగీనే గుర్తుపెట్టుకుంటారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇక కల్కి 2898 AD సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకా నాగీ చేస్తూనే ఉన్నాడు. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన మనసులోని మాటలను బయటపెడుతున్నాడు. తాజాగా తాను ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడో చెప్పి అందరిని షాక్ కు గురి చేశాడు. ఈ మధ్య ఎక్కువ సినిమాటిక్ యూనివర్స్ లు నడుస్తున్న విషయం తెల్సిందే.

Advertisement

ఒక సినిమా హిట్ అయితే చాలు.. దానికి సీక్వెల్ చేస్తూ వస్తున్నారు. అలాంటి సినిమాటిక్ యూనివర్స్ లలో వస్తున్న సినిమాలు అంటే.. పుష్ప 2, సలార్ 2, అనిమల్ పార్క్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఈ మూడు సినిమాల మీదనే అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అంటే నాగీ తడుముకోకుండా సలార్ 2 అని సమాధానమిచ్చాడు.

” సలార్ 2 కోసం ఎంతో క్యూరియాసిటీగా ఎదురుచూస్తున్నా.. సలార్ కథ నాకు ఎంతో బాగా నచ్చింది. మొదటి నుంచి నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే బాగా ఇష్టం. అదొక కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. సలార్ కూడా అలానే అనిపిస్తుంది. కొత్త ప్రపంచం.. కొత్త హిస్టరీ. అందుకే ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నా” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మాట వినడంతో ప్రభాస్ ఫ్యాన్స్.. కల్కి డైరెక్టర్ కూడా మన కులపోడేరా.. సలార్ 2 కోసమే వెయిటింగ్ అంట అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ గా సలార్ 2 త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×