BigTV English

Perni Nani: సీఎం చంద్రబాబుపై పేర్ని నాని సెటైర్లు

Perni Nani: సీఎం చంద్రబాబుపై పేర్ని నాని సెటైర్లు

Perni Nani: ఏపీలో అధికార మార్పిడి తర్వాత చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని పేర్నినాని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో అన్నీ అసత్యపు ఆరోపణలే ఉన్నాయని ఆరోపించారు. ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా నిరూపితం చేయలేదని అన్నారు. అధికారం చేపట్టి 35 రోజులు కావస్తున్నా.. ఇచ్చిన హామీల్లో పెన్షన్లు తప్ప ఏమీ చేయలేదని మండిపడ్డారు.


చంద్రబాబు మాజీ సీఎంను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. అమరావతి సంగతి కూడా అంతేనని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర, 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు అనుభవం పనికి రాకుండా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం 2024-25 రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టలేని పరిస్థితి ఉందన్నారు. జగన్‌కు అనుభవం లేకున్నా సరైన సమయానికి బడ్జెట్ ప్రవేశ పెట్టారని అన్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు కేంద్రం నుంచి డబుల్ డబ్యులేషన్ క్రింద రూ. 5,600 కోట్లు ఖజానాకు వచ్చిందని వివరించారు.

కూటమి పాలన 30 రోజులు పూర్తయ్యిందని, తన అనుభవం అంత అనుభవజ్ఞుడు లేడని సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు మాటలు కోటలు దాటాయి తప్ప ప్రజల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదు. పోలవరం ప్రాజెక్టు 70% మీరే కట్టారని చెబుతున్నారు. మిగతా 30% ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. అమరావతి అంత కలియ తిరిగారు. ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా చెప్పలేదు. విద్యుత్ శాఖపై కూడా శ్వేతపత్రం సమర్పించారు.


వైయస్ జగన్ మీద అబద్ధాలతో శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిద్దామని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. కరెంటు ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. విద్యుత్ ఛార్జీలపై చంద్రబాబు మాట మార్చారు. జగన్‌పై బాదుడే బాదుడు అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. 30 రోజుల్లో చెత్త పన్నులు ఆపారా? జగన్ అధికారంలో ఉన్నప్పుడు చెత్త పన్నులు విధిస్తే విమర్శించారు.

Also Read: అక్కడే ఆగండి.. పారిశుధ్య కార్మికులతో రోజా అభ్యంతరకర తీరు

రెండు రెట్లు ఎక్కువ ఆధాయం జగన్ సమకూర్చారు. నాలుగు అసత్యాలు వంద అబద్దాలతో చంద్రబాబు శ్వేతపత్రం ఉంది. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామన్నారు. సంపద సృష్టించి అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఖజానాలో డబ్బులు కూడా లేవని మాట్లాడుతున్నారని పేర్ని నాని పేర్కొన్నారు.

Tags

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×