E-Paper
Advertisement

Kalki 2898AD: కల్కి ఇంకా చూడలేదా.. అయితే ఈ బంపర్ ఆఫర్ మీకోసమే

Kalki 2898AD: కల్కి ఇంకా చూడలేదా.. అయితే ఈ బంపర్ ఆఫర్ మీకోసమే
Advertisement

Kalki 2898AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో దీపికా పదుకునే, దిశా పటానీ, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించగా.. బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ క్యామియో రోల్స్ లో కనిపించి మెప్పించారు.

ఎన్నో అంచనాల మధ్య జూన్ 27 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. రికార్డ్ కలక్షన్స్ రాబట్టింది. ఇప్పటివరకు రూ. 1100 కోట్ల కలక్షన్స్ అందుకున్న కల్కి.. ఇంకా థియేటర్ లో కొనసాగుతూనే ఉంది. దాదాపు నెల దాటి 5 రోజులు అవుతున్నా కూడా కల్కి ఇంతా థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతుంది.

Advertisement

ఇకపోతే కల్కిని ఇంత పెద్ద హిట్ చేసినందుకు అభిమానులకు మేకర్స్ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇప్పటివరకు కల్కి టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఈ వీక్ మాత్రం కేవలం రూ. 100 లకే కల్కి చూడొచ్చు. అప్రిషియేషన్ వీక్ అనే పేరుతో ఆగస్టు 2 నుంచి 9 వరకు.. కల్కి టికెట్ కేవలం రూ. 100 మాత్రమే అని మేకర్స్ ప్రకటించారు.

ఇప్పటివరకు కల్కిని థియేటర్ లో చూడనివారు కుటుంబంతో కలిసి ఈ వారం రోజుల్లో చూడమని చెప్పుకొచ్చారు. నిజం చెప్పాలంటే ఇది మంచి ఆఫరే. ఇలాంటి సినిమాలను థియేటర్ ఎక్స్పీరియెన్స్ చేయాలనీ, ఒకసారి చూసినవారు కూడా టికెట్ రేట్ తక్కువ కావడంతో మరోసారి వెళ్తామని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఓటీటీలో వస్తే చూడాలి అనుకున్నవారు.. టికెట్ రేటు తక్కువే కాబట్టి థియేటర్ కు వెళ్లి చూసేయండి.

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×