E-Paper
Advertisement

Saripodhaa Sanivaaram: శనివారం రోజు రక్తపాతమే.. పోస్టర్లతోనే పిచ్చెక్కిస్తున్నాడే

Saripodhaa Sanivaaram: శనివారం రోజు రక్తపాతమే.. పోస్టర్లతోనే పిచ్చెక్కిస్తున్నాడే
Advertisement

Saripodhaa Sanivaaram: న్యాచురల్ స్టార్ నాని గతేడాది హాయ్ నాన్న అంటూ ఎంతో క్లాస్ గా వచ్చి హిట్ అందుకున్నాడు. ఇక ఈ ఏడాది మాత్రం క్లాస్ తో పాటు ఊర మాస్ ను కూడా చూపించడానికి రెడీ అయ్యాడు. అంటే సుందరానికీ అనే క్లాసిక్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన కాంబో నాని- డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. సినిమా హిట్ టాక్ తెచ్చుకోలేదు కానీ, ఇప్పటికీ ఆ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు.

ఇక ఈసారి ఈ కాంబో సరిపోదా శనివారం అంటూ వస్తుంది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. విలక్షణ నటుడు ఎస్ జె సూర్య విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Advertisement

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. రిలీజ్ అయ్యేవరకు ప్రతి శనివారం.. ఈ సినిమా నుంచి వచ్చే పోస్టర్స్ ఉంటాయి మాస్టారూ నెక్స్ట్ లెవెల్ అంతే. సూర్యగా నాని, చారుగా ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. ఒక శనివారం క్లాస్ సూర్యను పరిచయం చేస్తే.. ఒక శనివారం మాస్ సూర్యను పరిచయం చేస్తారు. ఒకసారి సూర్య నవ్వుతుంటాడు.. ఇంకోసారి సూర్య ఉగ్రరూపంలో ఉంటాడు. ఇలా మేకర్స్ పోస్టర్స్ తోనే పిచ్చెక్కిస్తున్నారు.

తాజాగా నాని కొత్త పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. శనివారం రోజు రక్తపాతమే అని చెప్తూ.. దానికి తగ్గట్టుగానే రక్తంతో తడిసిన నానిని చూపించారు. అయితే ఈ శనివారం.. ట్రైలర్ అప్డేట్ ఇస్తున్నారో.. మూడో సింగిల్ గురించి అప్డేట్ ఇస్తారో మాత్రం చెప్పలేదు. ఇక ఈ సినిమా ఆగస్టు 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి శనివారం వరకు అభిమానులు వేచి చూడాల్సిందే.

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×