E-Paper
Advertisement

Kalki 2898AD: ప్రభాస్ ‘కల్కి’ వాయిదా.. నిరాశలో ఫ్యాన్స్..!

Kalki 2898AD: ప్రభాస్ ‘కల్కి’ వాయిదా.. నిరాశలో ఫ్యాన్స్..!
Advertisement

Kalki 2898AD: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అందులో ‘కల్కి 2898 ఏడీ’ ఒకటి. ఇందులో భారీ కాస్టింగ్ ఉండటంతో పాటు.. రాబోయే కాలం గురించి తెలియజేసే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఈ మూవీపై అంచనాలను ఓ రేంజ్‌లో పెంచేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చి అభిమానులను నిరాశ పరిచింది.

ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు సమ్మర్‌కి ఈ మూవీ వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. అది కూడా కష్టమే అన్నట్లుగా తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్, కమలహాసన్ పైన పలు సన్నివేశాలను సైతం తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించి గ్రాఫిక్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడంతో దాదాపుగా ఆరు నెలల సమయం పట్టొచ్చని గుస గుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా సమ్మర్ నుంచి కూడా వాయిదా పడడం ఖాయమనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తతో ప్రభాస్ అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. అసలు ఈ సినిమా ఈ ఏడాది వస్తుందా? రాదా అనే సందిగ్ధంలో కొట్టిమిట్టాడుతున్నారు. కాగా ఈ చిత్రంలో దీపికా పదుకొనే, దిశా పఠాని, అమితాబ్ బచ్చన్, కమలహాసన్ వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రలో నటిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×