E-Paper
Advertisement

Indian 2 Calendar Song: కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ నుంచి మరో సాంగ్.. అందంతో ఫిదా చేసిన మిస్ యూనివర్స్..

Indian 2 Calendar Song: కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ నుంచి మరో సాంగ్.. అందంతో ఫిదా చేసిన మిస్ యూనివర్స్..
Advertisement

Kamal Haasan Indian 2 Calendar Song(Cinema news in telugu): విలక్షణ నటుడు కమల్ హాసన్, క్రియేటివ్ దర్శకుడు శంకర్ ఒక్కటయ్యారు. వీరిద్దరూ కలిసి ‘ఇండియన్ 2’తో ఫుల్ బిజీగా ఉన్నారు. గతంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘ఇండియన్’ (భారతీయుడు) సినిమాకు ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్రం పట్టాలెక్క దాదాపు రెండేళ్లు గడిచిపోయింది. కానీ ఇప్పటికీ ఈ మూవీ రిలీజ్ కాలేదు. అందుకు కారణం దర్శకుడు లైనప్‌లో మరో సినిమా ఉండటమే అని ఇండస్ట్రీ టాక్. ‘ఇండియన్ 2’ సినిమాతో పాటు ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు కూడా శంకరే దర్శకత్వం వహిస్తుండటంతో డీలా పడుతూ వచ్చింది. అందులోనూ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండటంతో దర్శకుడు శంకర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

Advertisement

ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నాడు. ప్రముఖ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అండ్ మరో నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై నిర్మాత సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో ఇండియన్ 2 సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. అదే క్రమంలో ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఈ నెల అంటే జూలై 12న గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

Also Read: కల్కి అయ్యింది.. ఇక భారతీయుడు కోసం బయల్దేరిన కమల్

Advertisement

అనంతరం సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో కమల్ షేడ్స్ సినీ ప్రియుల్లో సరికొత్త ఆసక్తిని రేకెత్తించాయి. అంతేకాకుండా కమల్ లుక్‌ కూడా సర్‌ప్రైజ్‌గా ఉంది. మొత్తంగా ట్రైలర్‌తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు. దీంతో ఈ మూవీ కోసం సినీ ప్రియులు అండ్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

దీంతోపాటు ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ సినీ ప్రియుల్ని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే జోష్‌లో ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ను మేకర్స్ వదిలారు. ‘క్యాలెండర్’ అంటూ సాగే ఈ సాంగ్ కూడా అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. దక్షిణాఫ్రికా మోడల్.. 2017లో మిస్ యూనివర్స్ విన్నర్ డెమి-లీ టెబో ఈ సాంగ్‌లో కనిపించి కనువిందు చేసింది. సాంగ్‌లో ప్రతి సన్నివేశంలో తన అందంతో ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×