BigTV English

Car hits Pedestrians : పాదచారులను ఢీ కొట్టిన కారు.. 9 మంది మృతి

Car hits Pedestrians : పాదచారులను ఢీ కొట్టిన కారు.. 9 మంది మృతి

Seoul South Korea car accident(Today’s international news): ట్రాఫిక్ సిగ్నల్ వద్ద.. ఓ కారు పాదచారులను ఢీ కొట్టడంతో 9 మంది మరణించారు. ఈ దారుమ ఘటన దక్షిణ కొరియాలో జరిగింది. ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. అక్కడి మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్యాసింజర్ కారు రాంగ్ రూట్ లో వెళ్లి రెండు కార్లను ఢీ కొట్టింది. ఆ తర్వాత సిగ్నల్ వద్ద పాదచారులపైకి దూసుకెళ్లింది. ప్రమాదానికి కారణమైన 60 ఏళ్ల కారుడ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ.. ఈ ప్రమాదాన్ని వెంటనే నిర్థారించలేదు.


సియోల్ లోని సిటీ హాల్ కు సమీపంలో ఉన్న కూడలి వద్ద ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. కారు వేగం పెరగడంతో ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాద ఘటనపై ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ స్పందించారు.

Also Read : నాలుగేళ్ల తర్వాత సొంతదేశానికి పయనం.. అంతలోనే అనంతలోకాలకు..


బాధితులకు సహాయం చేయాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సియోల్ పోలీసులు తెలిపారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్ల ప్రమాదం జరిగిందా లేక అతివేగమే కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా.. దక్షిణ కొరియాలో రోడ్లపై వాహనాల వేగం పరిమితి గంటకు 50 కిలోమీటర్లు మాత్రమే. నివాస ప్రాంతాల్లో ప్రయాణించేటపుడు 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే పయనించాలి.

Related News

Pakistan: ఆయనో సేల్స్ మెన్, ఈయనో మేనేజర్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ప్రధానిపై సెటైర్లు

America News: ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న విమానాలు, ఎలా జరిగింది? వైరల్ అవుతున్న వీడియో

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

Lawrence Bishnoi Gang: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చుట్టూ ఉచ్చు.. కెనడా సంచలనం నిర్ణయం

Big Stories

×