E-Paper
Advertisement

Indian 2 Day 1 Collections: ‘ఇండియన్ 2’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఛా.. మరీ ఇంత దారుణంగానా..!

Indian 2 Day 1 Collections: ‘ఇండియన్ 2’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఛా.. మరీ ఇంత దారుణంగానా..!

Indian 2 Day 1 Collections: కొన్ని సినిమాలు ఎలాంటి బజ్ లేకుండా వచ్చి బాక్సాఫీసు వద్ద మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంటాయి. కానీ మరికొన్ని సినిమాలు మాత్రం ఫస్ట్ నుంచి సూపర్ డూపర్ హైప్‌తో వచ్చి బాక్సాఫీసు వద్ద ఘోరంగా ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అలాంటి అంచనాలతో వచ్చి ఫ్లాప్ టాక్ అందుకున్న లేటెస్ట్ మూవీ ‘ఇండియన్ 2’. 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్‌గా ఇండియాన్ 2 తెరకెక్కింది. ఈ సీక్వెల్ ప్రకటించినప్పటి నుంచి ఒకటే ఆసక్తి.. ఒకటే ఉత్కంఠ.

హీరోగా నటించేది విలక్షణ నటుడు కమల్ హాసన్.. అందులోనూ డైరెక్షన్ బాధ్యతలు శంకర్ తీసుకోవడంతో సినిమాపై బజ్ ఫుల్‌గా క్రియేట్ అయింది. ఆ హైప్ కారణంతోనే శంకర్ ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవెల్లో భారీ బడ్జెట్‌తో రూపొందించాడు. పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఇలా ఒక దాని తర్వాత ఒకటి రిలీజ్ చేస్తూ సినిమా రేంజ్‌ను మరింత పెంచేశారు. ఇక ఈ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేశారు. వారి వెయిటింగ్‌కు జూన్ 12తో తెరపడింది.

గ్రాండ్ లెవెల్లో జూన్ 12న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా చూసిన కొందరు.. అస్సలు బాగోలేదని అంటున్నారు. ఇందులో అసలు దర్శకుడు శంకర్ మార్క్ కనిపించలేదని చెప్తున్నారు. ఫస్ట్ పార్ట్ చాలా యావరేజ్‌గా ఉందని.. అలా అని సెకండ్ పార్ట్‌లో ఏమైనా మ్యాజిక్ చేస్తాడా అని ఎదురుచూసిన వారికి కూడా నిరాశే మిగిలిందని అంటున్నారు. అయితే ఇందులో కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ యాక్టింగ్ బాగున్నాయని అంటున్నారు.

Also Read: కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ ఓటీటీ డీల్ ఫిక్స్.. ఎందులో అంటే..?

ఏది ఏమైనా ఈ సినిమా పెద్దగా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేదనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇదే టాక్ ఇప్పుడు పబ్లిక్‌లోకి కూడా వెళ్లిపోయింది. దీంతో ఈ ప్రభావం ఒక్కసారిగా ఈ సినిమా కలెక్షన్ల మీద పడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు వస్తున్న టాక్ ఒకేత్తయితే.. తెలంగాణలో టికెట్ల ధరలు పెంచడం కూడా సినిమాకు కలిసిరాలేదని చెప్పాలి. చాలా మంది దీనిపైనే విమర్శలు చేస్తున్నారు. ఒక డబ్బింగ్ సినిమాకు టికెట్ల ధరలు పెంచడమేంటని పలువరు చర్చించుకుంటున్నారు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూద్దామని వెళ్దామనుకున్నా ధరలు భారీగా ఉండటంతో తగ్గిన తర్వాత చూడొచ్చులే అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇండియన్ 2 సినిమాకి కలిసి రాలేదని చెప్పాలి. మరి ఈ మూవీ కలెక్షన్ల విషయానికొస్తే.. తొలి రోజు ఇండియన్ 2 సినిమా దాదా రూ.26.1 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. తమిళ వెర్షన్‌లో రూ.16 కోట్లు, తెలుగులో రూ.8 కోట్లు వచ్చినట్లు సమాచారం. అయితే హిందీలో మాత్రం మరీ ఘోరంగా కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. హిందీలో కేవలం రూ.1 కోటి మాత్రమే వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాకు ఇలాంటి కలెక్షన్లు రావడం సినీ ప్రియుల్ని ఒకింత షాక్‌కి గురిచేస్తుంది. చూడాలి మరి త్వరలో ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయేమో.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×