Indian 2 streaming on OTT Platform Netflix Soon: విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఇండియన్ 2’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించాడు. 1996లో రిలీజ్ అయిన ‘భారతీయుడు’ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ టైటిల్‌తో తెరకెక్కింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒకటే ఆసక్తి. ఫస్ట్ పార్ట్ మంచి హిట్‌గా నిలవడంతో ఈ సీక్వెల్ కోసం పడిగాపులు కాశారు. అదే క్రమంలో ఈ సినిమా నుంచి ఒక్కో అప్డేట్‌ను రిలీజ్ చేస్తూ మేకర్స్ మరింత హైప్ క్రియేట్ చేశారు.
ఇందులో భాగంగానే పోస్టర్లు, గ్లింప్స్, టీజర్‌తో ఒకింత బజ్ క్రియేట్ చేసుకోగా.. ట్రైలర్‌తో మాస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇండియన్ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని అంతా ఫిక్స్ అయిపోయారు. ఈ మేరకు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఇక ఎట్టకేలకు వారి వెయిటింగ్‌కు తెరపడింది. ఈ సినిమా జూన్ 12న అంటే ఇవాళ గ్రాండ్ లెవెల్లో థియేటర్లలో రిలీజ్ అయింది.
ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా చూసిన కొందరు తమ రివ్యూలను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు. కొందరేమో ఈ సినిమా యావరేజ్‌గా ఉందని అంటుంటే మరికొందరేమో బాగుందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్‌గా ఉందని.. ఇప్పుడున్న యూత్‌కి ఏమాత్రం కనెక్ట్ కాలేదని చెప్పుకొస్తున్నారు.
Also Read: ఇండియన్ 2 మూవీపై ట్విట్టర్ రివ్యూలు..
మరికొందరేమో ఈ సినిమా చాలా అవుట్‌డేటెడ్‌లా అనిపించిందని ట్వీట్లు చేస్తున్నారు. ఎమోషన్, డ్రామా వర్కౌట్ ఎక్కడా కాలేదని.. కొన్ని సీన్లలో కమల్ హాసన్ మేకప్ కూడా తేలిపోయిందని చెప్పుకొస్తున్నారు. అయితే ఇంకొందరేమో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని.. అనిరుథ్ ఆర్ఆర్ అదరగొట్టేశాడని అంటున్నారు. ఇలా ఈ సినిమాకు ట్విట్టర్ ద్వారా మిక్స్ టాక్ వస్తుంది. ఇదిలా ఉంటే థియేటర్లలో రన్ అవుతున్న ఇండియన్ 2 సినిమా ఓటీటీకి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ ‘ఇండియన్ 2’ సినిమా స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే స్ట్రీమింగ్ డేట్‌కు సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం వంటి భాషల్లో మరో 30 రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.