E-Paper
Advertisement

Manorathangal: ఇదెక్కడి మాస్ సిరీస్ రా మావా.. మలయాళ హీరోలు అందరూ ఒకే దాంట్లో ..

Manorathangal: ఇదెక్కడి మాస్ సిరీస్ రా మావా.. మలయాళ హీరోలు అందరూ ఒకే దాంట్లో ..
Advertisement

Manorathangal: ఈ మధ్యకాలంలో హీరోలు.. మల్టీస్టారర్స్ చేయడానికి మొహమాటపడడం లేదు. ఒక స్టార్ హీరో మరో స్టార్ హీరోతో స్క్రీన్ ను షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇది మోలీవుడ్ లో కొత్తేమి కాదు. అక్కడ చిన్న, పెద్ద హీరోలు అని ఏం చూడరు. కథ నచ్చితే అందరూ కలిసి ఒక సినిమా చేయమన్నా చేస్తారు. నవరస, పావ కధైగల్ లాంటి సిరీస్ లు అలా వచ్చినవే.

ఇక తాజాగా మరో సినిమా ఇలానే స్ట్రీమింగ్ కానుంది. మలయాళ ప్రముఖ ఎమ్‌టీ వాసుదేవర్ నాయర్ రచించిన కథ ఆధారంగా తెరకెక్కిన సిరీస్ మనోరథంగల్. ఒకరు కాదు ఇద్దరు కాదు .. 9 మంది దర్శకులు ఈ సిరీస్ ను 9 భాగాలుగా తెరకెక్కించారు. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో స్టార్ హీరో కనిపించనున్నాడు.

Advertisement

మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, కమల్ హాసన్, బిజు మేనన్, పార్వతి తిరువత్తు, అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ, సిద్ధిఖీ తో పాటు లోక నాయకుడు కమల్ హాసన్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సిరీస్ ఎట్టకేలకు స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకుంది. ఆగస్టు 15 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

Advertisement

ఇక మలయాళంలో స్టార్ డైరెక్టర్స్ అయిన.. ప్రియదర్శన్, రంజిత్ సంతోష్ శివన్, శ్యామ్ ప్రసాద్, జయరాజ్, అశ్వతి, రతీశ్ అంబట్, మహేశ్ నారాయణన్.. ఒక్కో ఎపిసోడ్ కు దర్శకత్వం వహించారు. ఇక ఇంతమంది సెలబ్రిటీలు ఒకే సిరీస్ లో అనగానే ఎందరో ఆశ్చర్యపోతున్నారు. మరి ఇందులో దేనికి దానికి ఎండింగ్ ఇచ్చారా.. ? లేక చివర్లో వీళ్ళందరూ కలుస్తారా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఈ ట్రైలర్ ను చూసిన అభిమానులు.. ఇదెక్కడి మాస్ సిరీస్ రా మావా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సిరీస్ ఎలా ఉండబోతుందో చూడాలంటే ఆగస్టు 15 వరకు ఆగాల్సిందే.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×