E-Paper
Advertisement

Kamal Haasan – Indian 2: కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ కుదిరింది..!

Kamal Haasan – Indian 2: కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ కుదిరింది..!
Advertisement

Kamal Haasan – Indian 2 Trailer Update: ప్రముఖ విలక్షణ నటుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీ తర్వాత వరుసపెట్టి సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో ఒకటి ‘ఇండియన్ 2’. క్రియేటివ్ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో ఈ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఇందులో కమల్ హాసన తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు. గత 28 ఏళ్ల కిందట వచ్చిన ‘ఇండియన్’ మూవీకి ఇప్పుడు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మూవీ పట్టాలెక్కి దాదాపు 2 ఏళ్లు గడిచిపోయింది. కానీ ఇంకా రిలీజ్‌కు నోచుకోలేదు. అయితే ఇప్పుడిప్పుడే ఈ మూవీ అన్ని పనులు పూర్తి చేసుకుని జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ఒక్కొక్క అప్డేట్ అందిస్తూ సినీ ప్రియులు, అభిమానుల్లో ఫుల్ హైప్ పెంచే పనిలో పడ్డారు.

Advertisement

Also Read: దర్శకుడు శంకర్ ప్లాన్ అదుర్స్.. ‘ఇండియన్ 2’ కోసం తరలి వస్తున్న సౌత్ స్టార్ హీరోలు?

ఇందులో భాగంగానే పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేస్తూ అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో మరిన్ని అప్డేట్స్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ మూవీ ట్రైలర్ కోసం బాగా వెయిట్ చేస్తున్నారు. అందువల్ల ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నెల అంటే జూన్ 25న ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ముంబైలో ఓ పెద్ద ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ నిర్వహించి ఆ ఈవెంట్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ట్రైలర్ 2.36 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఈ వార్తతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరో మూడు రోజుల్లో ఈ ట్రైలర్ రిలీజ్ కానుండటంతో అందరూ హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి దీనిపై ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ లేనప్పటికీ.. త్వరలో మేకర్స్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సిద్ధార్థ్ వంటి నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×