BigTV English

South Stars for Indian 2 Movie: దర్శకుడు శంకర్ ప్లాన్ అదుర్స్.. ‘ఇండియన్ 2’ కోసం తరలి వస్తున్న సౌత్ స్టార్ హీరోలు?

South Stars for Indian 2 Movie: దర్శకుడు శంకర్ ప్లాన్ అదుర్స్.. ‘ఇండియన్ 2’ కోసం తరలి వస్తున్న సౌత్ స్టార్ హీరోలు?

Rajinikanth, Ram Charan, Simbu & Mohanlal are attending Indian 2 Audio Release Function: విలక్షణ నటుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ మూవీ ముందు వరకు ఎలాంటి హిట్లు లేక చాలా సఫర్ అయ్యాడు. ఒక్క సినిమా అయినా హిట్ ఇస్తుందేమో అని వరుస పెట్టి సినిమాలు చేశాడు. కానీ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద ఫ్లాప్‌ అయ్యాయి. ఇక అప్పుడే మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో ‘విక్రమ్’ మూవీ చేశాడు. ఈ మూవీపై కూడా పెద్దగా ఎవ్వరికి నమ్మకం లేదు. కానీ మూవీ రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ టాక్‌తో కమల్ హాసన్‌కు ఎనర్జీని వచ్చింది.


దీంతో అవకాశాలు వెల్లువెత్తాయి. కమల్ పని అయిపోయిందనుకున్న సమయంలో విక్రమ్ మూవీ హిట్‌ సాధించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. అయితే ఇప్పుడు కమల్ లైనప్‌లో చాలా సినిమాలు ఉన్నాయి. అందులో ప్రముఖ క్రియేటివ్ దర్శకుడు శంకర్‌తో ‘ఇండియన్2’ చేస్తున్నాడు. గతంలో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ఇది తెరకెక్కుతోంది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అదీగాక అటు స్టార్ హరో కమల్ హాసన్, ఇటు మాస్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ఒకటవ్వడంతో ఆ ఎనర్జీ మరో స్థాయికి చేరింది. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో రకుల్ ప్రీత్, కాజల్ అగర్వాల్ వంటి హీరోయిన్లు నటిస్తున్నారు.


Also Read: కమల్ హాసన్‌ ఫ్యాన్స్‌కు మళ్లీ షాక్.. ఇండియన్ 2 వాయిదా?.. పండగ చేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్..!

అలాగే ఎస్ జే సూర్య, బాబీ సింహా, సిద్ధార్థ్ వంటి స్టార్ యాక్టర్స్ కూడా ఈ మూవీలో కీలక పాత్రల్లో నటిస్తుండటంతో సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ అర్థమైపోయింది. అయితే ఎప్పుడో పట్టాలెక్కిన ఈ సినిమా ఇప్పటికి రిలీజ్ కాలేదు. ఇక ఈ మధ్యే షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఈ నేపథ్యంలో నటుడు కమల్ హాసన్ ఈ మూవీ రిలీజ్ కు సంబంధించి క్రేజీ అప్డేట్ అందించాడు.

ఇందులో భాగంగా ‘ఇండియన్2’ సినిమాను జులైలో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా ఈ మూవీ మూడో పార్ట్ గురించి కూడా మాట్లాడాడు. ఇండియన్ 2 మూవీ రిలీజ్ అయిన 6 నెలల తర్వాత ఇండియన్ 3 మూవీ రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు ఇండియన్ 2 ఆడియో లాంచ్ ఈవెంట్‌ను జూన్ 1న నిర్వహిచనున్నట్లు క్రేజీ అప్డేట్ అందించాడు. ఈ అప్డేట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Also Read: Artist Hema: నేను హైదరాబాద్ లోనే ఉన్నాను.. నాకు ఏ రేవ్ పార్టీతో సంబంధం లేదు: నటి హేమ

కాగా ఈ లాంచ్ ఈవెంట్‌ను దర్శకుడు శంకర్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుక కోసం సౌత్‌లోని బడా స్టార్ హీరోలను తీసుకువస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రజినీకాంత్, రామ్ చరణ్ వంటి స్టార్లు రాబోతున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా మరొక వార్త బయటకొచ్చింది. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, శింబు, శివ కార్తికేయన్ వంటి స్టార్ హీరోలు ఈ ఈవెంట్‌ను హాజరుకానున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×