E-Paper
Advertisement

Kangana Ranaut: కంగనా ఎమర్జెన్సీ మూవీకి గుడ్ న్యూస్..పోస్ట్ వైరల్..!

Kangana Ranaut: కంగనా ఎమర్జెన్సీ మూవీకి గుడ్ న్యూస్..పోస్ట్ వైరల్..!
Advertisement

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) తాజాగా నటించిన చిత్రం ఎమర్జెన్సీ (Emergency ) ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూనే ఉంది. అయితే ఎట్టకేలకు కంగనా రనౌత్ ఎమర్జెన్సీ చిత్రానికి గుడ్ న్యూస్ లభించిందని చెప్పవచ్చు. త్వరలోనే విడుదల కూడా చేస్తామని ఆ గుడ్ న్యూస్ ని చెబుతూ అభిమానులతో పంచుకుంది లేడీ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.

కంగనా ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్..

Advertisement

అసలు విషయంలోకి వెళితే.. స్వీయ దర్శకత్వంలో కంగనా రనౌత్ నటించిన చిత్రం ఎమర్జెన్సీ. విడుదలకు ముందే ఎన్నో వివాదాలలో చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే.ఇలా పలు ఆరోపణలు, వివాదాల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాకి తాజాగా సెన్సార్ పూర్తయిందని, సర్టిఫికెట్ కూడా అందింది అని కంగనా తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా ప్రకటించి తో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ మేరకు.. “ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటిస్తాము. ఇన్ని రోజులు ఓపికగా ఎదురు చూసినందుకు ధన్యవాదాలు” అంటూ ఆమె తెలిపింది.

వివాదాలు ఎదుర్కొన్న కంగనా ఎమర్జెన్సీ..

Advertisement

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ(Indira Gandhi)రాజకీయ జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ఎమర్జెన్సీ. నాటి పరిస్థితులను ప్రముఖంగా చూపించనున్నట్లు ప్రచార చిత్రాలు విడుదల అవ్వగా.. అప్పటినుంచి ఈ సినిమాపై విమర్శలు కూడా వినిపించాయి. అంతే కాదు తమ గురించి తప్పుగా చిత్రీకరించారంటూ ఒక వర్గం సెన్సార్ బోర్డు కు కూడా లేఖ రాసింది. దీనికి తోడు తెలంగాణలో కూడా ఈ సినిమా విడుదల అడ్డుకుంటామని ఒక వర్గం వారు వాదించగా.. వారికి అండగా నిలిచారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth reddy).. ఇకపోతే ఎట్టకేలకు సెన్సార్ బోర్డు ఈ సినిమాకు సంబంధించి పలు సన్నివేశాలలో కొన్ని రోజుల క్రితం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఫైర్ అయిన కంగనా సెన్సార్ బోర్డు లోనూ చాలా సమస్యలు ఉన్నాయని, అందుకే తమ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. న్యాయపోరాటం చేయడానికి కూడా తాను సిద్ధమని తెలిపింది.

విడుదల తేదీ ప్రకటిస్తామన్న కంగనా..

ఈ క్రమంలోనే ఎమర్జెన్సీ చిత్రం విషయంలో ఒక నిర్ణయానికి రావాలి అంటూ బాంబే హైకోర్టు.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ ను ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. దీనికి తోడు కంగనాకి కూడా మార్పులను సూచించింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ పాస్ కావడానికి షరతులు కూడా పెట్టగా, సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వచ్చినట్లు వీటిలో మార్పులు చేయాలని మేకర్స్ కి ఆదేశించారు కూడా.. ఇలా అన్ని పూర్తయిన తర్వాత తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరొకవైపు కంగనా కూడా ఈ విషయంలో హత్య బెదిరింపులు ఎదుర్కోవడం గమనార్హం. ఇలా పలు కారణాలవల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 6వ తేదీన విడుదల కావాల్సి ఉండగా ఇలా విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వగా త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని కంగనా తెలిపింది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×