E-Paper
Advertisement

Karthik Subbaraj: ‘సూర్య 44’ స్టోరీ ఇదే.. ప్రేక్షకులకు షాకిచ్చిన కార్తిక్ సుబ్బరాజ్

Karthik Subbaraj: ‘సూర్య 44’ స్టోరీ ఇదే.. ప్రేక్షకులకు షాకిచ్చిన కార్తిక్ సుబ్బరాజ్
Advertisement

Karthik Subbaraj: కోలీవుడ్‌లో కొందరు సీనియర్ హీరోలు ప్యాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు తీస్తూ వాటితోనే హిట్ కొట్టాలని ఫిక్స్ అయిపోతున్నారు. అందుకే హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుసగా ప్యాన్ ఇండియా కథలనే ఎంచుకుంటున్నారు. అందులో హీరో సూర్య (Suriya) కూడా ఒకడు. ఇప్పటికే ‘కంగువ’ (Kanguva) లాంటి భారీ బడ్జెట్ సినిమాతో రంగంలోకి దిగడానికి సిద్ధమయ్యాడు సూర్య. ఇది ఇంకా విడుదల అవ్వకముందే మరో రెండు ప్యాన్ ఇండియా సినిమాలను లైన్‌లో పెట్టాడు. ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో మూవీని మొదలుపెట్టాడు. ‘సూర్య 44’గా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి దర్శకుడు పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.

అదే స్టోరీనా?

Advertisement

కోలీవుడ్‌లో మాత్రమే కాదు టాలీవుడ్‌లో కూడా కార్తిక్ సుబ్బరాజ్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్ చేయాలో, కమర్షియల్ సినిమాల్లో ఎలాంటి ఎలిమెంట్స్ యాడ్ చేస్తే హిట్ అవుతాయో కార్తిక్‌కు బాగా తెలుసు అని ఫ్యాన్స్ అంటుంటారు. అలాంటి డైరెక్టర్‌తో సూర్య సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మామూలుగా కార్తిక్ సుబ్బరాజ్ సినిమాల్లో హీరో చాలా మాస్‌గా ఉంటాడు. దాంతో పాటు ఒక స్టైలిష్‌ గ్యాంగ్‌స్టర్ అయ్యింటాడు. సూర్యతో చేయబోయే మూవీలో కూడా అలాగే ఉండబోతుందా అనే విషయంపై తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj).

Also Read: ఒకే కథతో రెండు సినిమాలు.. తప్పు ఒప్పుకున్న ‘ది గోట్’ డైరెక్టర్

Advertisement

గ్యాంగ్‌స్టర్ సినిమా కాదు

‘నేనొక సినిమా చేస్తున్నాను అనగానే అందరూ గ్యాంగ్‌స్టర్ సినిమా అనే అనుకుంటారు. సూర్య 44 (Suriya 44) ఒక గ్యాంగ్‌స్టర్ మూవీ కాదు. అదొక ప్రేమకథ. లవ్, కామెడీ, వార్.. అన్నీ లోడ్ అవుతున్నాయి’ అంటూ ఫ్యాన్స్‌లో హైప్ క్రియేట్ చేశాడు కార్తిక్ సుబ్బరాజ్. ఇప్పటివరకు కార్తిక్ సుబ్బరాజ్ సినిమాల్లో ఒక చిన్న లవ్ స్టోరీ కూడా ఉంటుంది. కానీ ఔట్ అండ్ ఔట్ లవ్ స్టోరీని మాత్రం తను ఇప్పటివరకు తెరకెక్కించలేదు. అలాంటి ‘సూర్య 44’తో ఆ ప్రయోగం చేయనున్నాడు ఈ మాస్ డైరెక్టర్. అయితే గ్యాంగ్‌స్టర్ సినిమాల్లో కూడా ఎమోషన్ ఎలా పండించాలో తెలిసిన డైరెక్టర్ కావడంతో కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించే లవ్ స్టోరీ ఎలా ఉంటుందా అని ఆడియన్స్ చర్చించుకుంటున్నారు.

వెంటనే షూటింగ్

కార్తిక్ సుబ్బరాజ్ చివరిగా ‘జిగర్తండా డబుల్ ఎక్స్’ మూవీని తెరకెక్కించాడు. రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీ క్లీన్ హిట్ అందుకుంది. అంతే కాకుండా దర్శకుడిగా తనకు మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రెండేళ్ల నుండి ‘సూర్య 44’ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుంటున్నాడు కార్తిక్. అందుకే ‘కంగువ’ మూవీ అయిపోగానే వెంటనే కార్తిక్ సుబ్బరాజ్ సినిమా సెట్‌లో అడుగుపెట్టాడు సూర్య. శివ దర్శకత్వంలో తాను నటించిన ‘కంగువ’ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఫైనల్‌గా నవంబర్ 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. తమిళంతో పాటు ఇతర సౌత్ భాషలు, హిందీలో కూడా ఒకేసారి విడుదలకు సిద్ధమయ్యింది ‘కంగువ’.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×