E-Paper
Advertisement

RC16: రామ్ చరణ్ – బుచ్చిబాబు ‘RC16’ నుంచి శివ రాజ్ కుమార్ స్పెషల్ పోస్టర్

RC16: రామ్ చరణ్ – బుచ్చిబాబు ‘RC16’ నుంచి శివ రాజ్ కుమార్ స్పెషల్ పోస్టర్
Advertisement

RC16 team wishes to Shiva Rajkumar(Today tollywood news): గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘Rc 16’ వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. అలాగే ప్రముఖ ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి కొన్ని పాటలు పూర్తి చేసినట్లు దర్శకుడు ఇటీవల ఓ ఈవెంట్‌లో చెప్పుకొచ్చాడు. దీంతో అంతా షాక్ అయిపోయారు. సినిమా ఇంకా పట్టాలే ఎక్కకుండా సాంగ్స్ చిత్రీకరించేశారా అంటూ తెగ చర్చ జరిగింది. అయితే ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా చెప్పడంతో అంతా కామ్ అయిపోయారు. ఇక ఈ మూవీలో స్టార్ నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఒకరు.

Advertisement

Also Read: రామ్ చరణ్ ‘ఆర్సీ 16’ నుంచి క్రేజీ అప్డేట్ అందించిన దర్శకుడు.. వీడియో వైరల్

ఈ నటుడు ఆర్‌సి 16 మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆయన బర్త్ డే సందర్భంగా మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించారు. ఈ మేరకు శివ రాజ్ కుమార్‌కు విషెస్ తెలుపుతూ ఆర్‌సి 16 మూవీ యూనిట్ తాజాగా ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘కరునాడ చక్రవర్తి’కి స్వాగతం అంటూ క్యాప్షన్ ఇచ్చి ఆ పోస్టర్ షేర్ చేశారు. అందులో శివరాజ్ కుమార్ చాలా ధీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

ఇకపోతే కన్నడ ఇండస్ట్రీలో శివన్నకు మంచి పాపులారిటీ ఉంది. అలాగే బజరంగీ, వేధ, జైలర్ వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు తొలిసారి తెలుగు సినిమాలో నటిస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో రామ్ చరణ్ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. త్వరలో ఈ మూవీ రిలీజ్‌కు సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ వెల్లడించనున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×