Big Stories

RC 16: రామ్ చరణ్ ‘ఆర్సీ 16’ నుంచి క్రేజీ అప్డేట్ అందించిన దర్శకుడు.. వీడియో వైరల్

rc 16
rc 16

Ram Charan And Buchi Babu Combo Rc 16 Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా.. క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అయితే మార్చి 27న చరణ్ బర్త్ డే కావడంతో అతడు నటిస్తున్న.. నటించబోతున్న సినిమాల నుంచి పలు క్రేజీ అప్డేట్స్ రావడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. అందులో చరణ్ తన కెరీర్‌లో నటిస్తున్న ‘ఆర్‌సి 16’ మూవీ నుంచి కూడా అదిరిపోయే అప్డేట్ వచ్చి అందరిలోనూ జోష్ నింపింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

- Advertisement -

ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమయింది. ‘ఆర్‌సి 16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సానా దర్వకత్వం వహిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ఇందులో గ్లోబల్ స్టార్‌కి జోడీగా నటిస్తోంది. అలాగే ఇందులో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

- Advertisement -

ప్రముఖ ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అయితే మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే రోజున ఈ మూవీ దర్శకుడు బుచ్చిబాబు సానా అదిరిపోయే అప్డేట్ అందించాడు. చరణ్ బర్త్ డే సందర్భంగా ఓ ఈవెంట్‌ను నిర్వహించగా.. అందులో ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.

Also Read: రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. ఈ పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా బాసు

ఆయన మాట్లాడుతూ.. ‘ఆర్‌సి 16’ మూవీకి సంబంధించి మొత్తం 3 సాంగ్స్ కంప్లీట్ అయినట్లు తెలిపాడు. అయితే ఆ సాంగ్స్ చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని.. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ చాలా కేర్ తీసుకుని సూపర్‌గా అందించారని అన్నారు.

అవన్నీ మీరు త్వరలో చూడబోతున్నారని.. ఫస్ట్ సాంగ్ నుంచే దద్దరిల్లే రెస్పాన్స్ వస్తుందని అన్నారు. తనకు పాటలంటే చాలా ఇష్టమని తెలిపారు. కాగా ఉప్పెన మూవీలో దేవిశ్రీ అందించిన సాంగ్స్ కంటే రెహమాన్ దానికంటే మరింత హైరేంజ్‌లో ఆర్‌సి 16లో సాంగ్స్ అందించారని తెలిపారు. ఈ అప్డేట్‌తో సినీ ప్రియులు, అభిమానుల్లో ఫుల్ జోష్ మొదలైంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ అప్డేట్‌తో పాటు చరణ్ నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి కూడా మేకర్స్ అద్భుతమైన అప్డేట్ వదిలారు. ఈ చిత్రం నుంచి జరగండి.. జరగండి అంటూ సాగే సాంగ్‌ను రిలీజ్ చేశారు.

Also Read: శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ దంపతులు..

ఈ సాంగ్ చాలా కలర్ ఫుల్‌గా.. కనిపించి కనువిందు చేసింది. అయితే సినీ వర్గాల సమచారం ప్రకారం.. ఈ సాంగ్ కోసం దాదాపు రూ.16 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్లతో పాటు రిలీజ్ డేట్‌ను విడుదల చేసే అవకాశముంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News