E-Paper
Advertisement

KANTARA-2: ‘కాంతార-2’ వచ్చేస్తోంది.. జూన్ నుంచి షూటింగ్!

KANTARA-2: ‘కాంతార-2’ వచ్చేస్తోంది.. జూన్ నుంచి షూటింగ్!
Advertisement

KANTARA-2: కన్నడ స్టార్ హీరో రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కాంతార’. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా లెవల్‌లో ఘన విజయం సాధించింది. రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘కాంతార-2’ ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్న సినీ ప్రియులకు మేకర్స్ గుడ్ న్యూస్ తెలిపారు. త్వరలోనే ‘కాంతార-2’ను తెరకెక్కించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది.

పార్ట్ 2 షూటింగ్‌ జూన్‌లో మొదలయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ తెలిపారు. సినిమాలో కొన్ని సీన్స్ వర్షాకాలం నేపథ్యంలో తెరకెక్కించేవి ఉండడంతో.. ఆ నెలలో షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పనులను రిషబ్ శెట్టి మొదలు పెట్టారని వెల్లడించారు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ స్టోరీకి సంబంధించిన రీసెర్చ్ చేస్తున్నారని తెలిపారు. అయితే ఇది కాంతారకు సీక్వెల్ కాదని ప్రీక్వెల్ అని చెప్పారు. పాన్‌ ఇండియా లెవల్‌లో 2023 ఏప్రిల్ లేదా మేలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×