కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో 90 లలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది కస్తూరి శంకర్ (Kasthuri Shankar). ఇటీవల తెలుగు వారి గురించి చేసిన వ్యాఖ్యలతో ఏకంగా అరెస్టయి 13 రోజులు రిమాండ్ లో ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, ఆస్తుల గురించి కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. కస్తూరి శంకర్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. ఈమె తల్లి సుమతి న్యాయవాది. తండ్రి శంకర్ ఇంజనీర్. దీంతో చిన్నప్పటి నుంచే ఉన్నతమైన లైఫ్ ను లీడ్ చేసింది కస్తూరి.
ఫెమినా మిస్ మద్రాస్ గా కస్తూరి..
మోడలింగ్ పై ఆసక్తి పెంచుకున్న ఈమె, కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ వైపు అడుగులు వేసింది.అలా 1992లో నిర్వహించిన మిస్ చెన్నై పోటీల్లో గెలుపొందింది. తర్వాత ఫెమినా మిస్ మద్రాస్ పోటీల్లో కూడా గెలిచారు కస్తూరి శంకర్. ఇక తర్వాత సినిమాల వైపు అడుగులు వేసింది . దీంతో తల్లిదండ్రుల సహాయ సహకారాలు కూడా ఎంతో లభించాయి. ఇకపోతే ఈమె తల్లి న్యాయవాది కావడంతో చిన్నప్పటి నుంచే సమాజంలోని ఎన్నో విషయాలపై తన గొంతు వినిపిస్తూనే ఉండేది కస్తూరి శంకర్. ఈ క్రమంలోనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.
చిన్నప్పటి నుంచే ధనవంతురాలు..
ఇక ఈమె ఆస్తుల వివరాల విషయానికొస్తే.. ఈమె వయస్సు 48 ఏళ్లు. కస్తూరి భర్త రవికుమార్. ఒక డాక్టర్. వీరికి సంకల్ప్ అనే కొడుకుతో పాటు శోభిని అనే కూతురు కూడా ఉంది. ధనవంతుల కుటుంబానికి చెందినవారు కావడంతో కస్తూరి కి చెన్నైలో రెండు ఇళ్ళు కూడా ఉన్నాయి. అలాగే హైదరాబాదులో ఒకటి, అమెరికాలో కూడా ఒక ఇల్లు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ఈమె భర్త భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుమారుగా రూ.300 కోట్లకు పైగా వీరి ఆస్తి ఉంటుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఇందులో ఎంత నిజమందో తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈమె చిన్నప్పటినుంచి ధనవంతుల కుటుంబంలోనే పుట్టి పెరిగినట్లు తెలుస్తోంది.
సెంట్రల్ జైల్ లో రిమాండ్ లో ఉన్న కస్తూరి..
వివాదాల్లో చిక్కుకోవడం ఈమెకు చిన్నప్పటి నుంచే అలవాటు. ఈ క్రమంలోనే తెలుగు మాట్లాడే వారిపై కస్తూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపాయి. ముఖ్యంగా తెలుగు మాట్లాడే వారిపై ఈమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. దీంతో పలుచోట్ల కేసులు నమోదు అవ్వగా.. ఈమెకు నోటీసులు అందివ్వాలని పోలీసులు చెన్నైలోనే ఆమె నివాసానికి వెళ్తే.. ఇంటికి తాళం వేసి ఫోన్ స్విచాఫ్ చేసుకుందని, దాంతో పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఈమె కోసం వెతకగా.. హైదరాబాదులో ఈమెను రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు.అలాగే చెన్నై ఎగ్మోర్ పోలీస్ స్టేషన్లో కస్తూరిపై ఫిర్యాదు నమోదు కావడంతో నవంబర్ 16న హైదరాబాదులో అరెస్టు చేయడం జరిగింది.
పోలీసులకు సహకరిస్తాను..
ఒక నిర్మాత ఇంట్లో ఈమె దాక్కుందని అక్కడ గుర్తించిన పోలీసులు ఈమెను అరెస్టు చేశారని వార్తలు వినిపించాయి. అయితే కస్తూరి శంకర్ విడుదల చేసిన వీడియోలో మాత్రం.. తన ఇంటి నుంచే పోలీసులు తనని అరెస్టు చేశారని, తాను ఎవరికో భయపడి దాక్కోలేదని, పోలీసులకు సహకరిస్తానని కూడా తెలిపింది. ఇకపోతే సెంట్రల్ జైలుకు తరలించిన ఈమెను 13 రోజులపాటు రిమాండ్ లో ఉంచనున్నారు.