Vishwambhara: ఈరోజుల్లో సీనియర్ హీరోలు సైతం యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. వారి వయసుకు తగిన పాత్రలు ఎంచుకుంటూ, ప్రేక్షకులు మెచ్చే విభిన్నమైన కథలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. మెగా ఫ్యామిలీ నుండి ఎంతోమంది హీరోలు వచ్చినా వారందరికీ తానే పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు చిరు. కానీ వరుసగా రీమేక్స్ వల్ల ఆయనకు ఎదురుదెబ్బలు తగిలాయి. అందుకే ఒక యంగ్ దర్శకుడిని నమ్ముకొని సోషల్ ఫ్యాంటసీ చిత్రంతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమయ్యారు. అదే ‘విశ్శంభర’. తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి ఒక ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది.
‘విశ్వంభర’ కష్టాలు
చిరంజీవి రాజకీయాల నుండి సినిమాల వైపుకు వచ్చి పూర్తిగా వీటిపైనే ఫోకస్ పెట్టిన తర్వాత అరడజనుకు పైగా సినిమాల్లో నటించారు. కానీ అందులో దాదాపు అన్ని రీమేక్సే. మొదట్లో ఈ రీమేక్స్ బాగానే వర్కవుట్ అవుతున్నాయని అనిపించాయి. ఆ తర్వాత కొన్ని రీమేక్స్ పర్వాలేదు అనిపించాయి. కానీ మెల్లగా వాటిపై ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ పోయింది. ఇంక రీమేక్స్ వద్దు బాసూ అని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా వినకుండా ‘భోళా శంకర్’ చేశారు చిరంజీవి (Chiranjeevi). ఆ మూవీ రిజల్ట్‌తో సీన్ అర్థమయిపోవడంతో ఇప్పుడు మళ్లీ ఫార్మ్‌లోకి రావాలంటే ‘విశ్వంభర’పైనే పూర్తి ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయ్యారు. దానికోసమే ఇప్పుడు కష్టపడుతున్నారు.
Also Read: బాలయ్యకే ముచ్చెమటలు పట్టించిన అల్లరిపిల్ల అర్హ.. ఏం చేసిందో చూడండి
జపాన్‌లో షూటింగ్
‘బింబిసార’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు వశిష్ట. మొదటి మూవీనే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు. అలా రెండో సినిమాతోనే చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. చిరంజీవి, వశిష్ట కాంబినేషన్‌లో ‘విశ్వంభర’ను అనౌన్స్ చేసినప్పటి నుండి దీనిపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తికాగా ప్రస్తుతం చిరు, త్రిష (Trisha) మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కోసం మూవీ టీమ్ అంతా జపాన్‌కు బయల్దేరింది. ఈ రొమాంటిక్ డ్యూయెట్‌ను విజయ్ బిన్నీ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ‘విశ్వంభర’ అప్డేట్ గురించి ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా మేకర్స్ నుండి మాత్రం అధికారికంగా ఎలాంటి స్పందన లేదు.
నెగిటివ్ రివ్యూలు
కొన్నాళ్ల క్రితం ‘విశ్వంభర’ నుండి టీజర్ విడుదలయ్యింది. ఇదొక సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో విజువల్స్ అన్నీ చాలా బాగుంటాయని ప్రేక్షకులు ఊహించారు. కానీ అలా జరగలేదు. ఈ టీజర్‌లోని విజువల్స్ అన్నీ హాలీవుడ్ సినిమాల నుండి కాపీ కొట్టారని, అస్సలు చూడడానికి టీజర్ ఏం బాలేదని పూర్తిగా నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. అయినా మూవీ టీమ్ ఈ నెగిటివ్ రివ్యూలపై స్పందించలేదు. కనీసం సినిమా అయినా ఇలా ఉండకపోతే చాలు అని చిరు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అసలైతే 2025 సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ.. పోటీ పెరగడంతో సంక్రాంతి రేసు నుండి తప్పుకుందని సమాచారం.