BigTV English

Kasturi Shankar: నా అర్ధ నగ్న ఫోటోలను లీక్ చేశారు.. సెన్స్ లేదు వాళ్ళకి..: సీనియర్ నటి కస్తూరి శంకర్!

Kasturi Shankar: నా అర్ధ నగ్న ఫోటోలను లీక్ చేశారు.. సెన్స్ లేదు వాళ్ళకి..: సీనియర్ నటి కస్తూరి శంకర్!

Kasturi Shankar Response on Controversy Photoshoot: సీనియర్ నటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక టాపిక్ మీద ఆమె సోషల్ మీడియాలో మాట్లాడుతూనే ఉంటుంది. మొన్నటికి మొన్న దర్శన్ కేసు గురించి మాట్లాడి సెన్సేషన్ సృష్టించింది. దర్శన్ హత్య చేయడం తప్పేనని, కానీ, అందులో పవిత్ర గౌడ తప్పేమి లేదని ఆమె చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. చూడడానికి ఎంతో అమాయకంగా కనిపించినా .. ఆమె ఎప్పుడు ఫైర్ బ్రాండ్ అనే చెప్పాలి.


గృహాలక్ష్మీ సీరియల్ తో బుల్లితెరపై కూడా ఆమె మంచి విజయాన్ని అందుకుంది. అయితే కస్తూరి చేసిన ఒక  ఫోటోషూట్ అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది. వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే ఆమె ఒక డాక్టర్ ను వివాహమాడి అమెరికాకు వెళ్ళిపోయింది. ఆ తరువాత ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలోనే బిడ్డకు పాలు ఇస్తూ అర్థనగ్నంగా ఫోటోషూట్ చేసింది. ఈ ఫొటోస్ అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె దీని గురించి మాట్లాడింది. అసలు ఆ ఫోటోలు తన అనుమతి లేకుండా పబ్లిష్ చేశారని మండిపడింది. ఇండియాలోని ప్రముఖ మీడియా కంపెనీనే వాటిని దొంగిలించి పబ్లిష్ చేసినట్లు తెలిపింది. వారికి సెన్స్ లేదని ఫైర్ అయ్యింది.


Also Read: Vijayashanti Birthday : లేడీ సూపర్ స్టార్ విజయశాంతి.. పోలీస్ లుక్ లో ఏముంది బాసూ

“ఆ ఫోటోషూట్ నేను ఇండియా కోసం చేయలేదు. అమెరికాలో తల్లిబిడ్డల మాతృత్వం గురించి ఒక మ్యాగజైన్ వారు అడిగితే ఓకే చెప్పాను. దాన్ని ఇండియాలో రిలీజ్ చేయకూడదు. కానీ, కొంతమంది ఆ ఫోటోలను దొంగలించి.. ఇండియాలో లీక్ చేశారు. కనీసం నన్ను కూడా సంప్రదించలేదు. మాతృత్వానికి అమెరికా వాళ్లు ఇచ్చే విలువ వేరు ఉంటుంది.. మనవాళ్ళు ఇచ్చే విలువ వేరు ఉంటుంది.

ఇక్కడ బిడ్డకు పాలు ఇచ్చినా ఏదోరకంగా చూస్తారు. అయితే అందరూ అలా ఉండరని తెలుసుకున్నా.. ఆ ఫోటోషూట్ చూసినా చాలామంది ఇండియన్ మహిళలు కూడా నన్ను ప్రశంసించారు. ఎందుకంటే వారు కూడా అమ్మలే కాబట్టి. వారికి కూడా ఆ విలువ తెలుసు కాబట్టి. ఆ తరువాత పురుషులు కూడా నాకు సపోర్ట్ గా నిలిచారు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

×