E-Paper
Advertisement

Delhi Water Crisis: అతిషి దీక్షపై ఢిల్లీ బీజేపీ చీఫ్ తీవ్ర విమర్శలు!

Delhi Water Crisis: అతిషి దీక్షపై ఢిల్లీ బీజేపీ చీఫ్ తీవ్ర విమర్శలు!
Advertisement

Delhi Water Crisis: ఢిల్లీలో నీటి సంక్షోభానికి నిరసనగా మంత్రి అతిషి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షపై ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ్ విమర్శలు గుప్పించారు. మీడియా ఫోటోలకు ఫోజులు ఇచ్చేందుకే ఆమె వేదిక వద్ద ఉంటున్నారని అన్నారు. ఇదేం నిరాహార దీక్ష అని ఎద్దేవా చేశారు. అతిషి దీక్ష ఎయిర్ కండీషన్ సత్యాగ్రహం లాగా ఉందని వ్యాఖ్యానించారు. రాజకీయ డ్రామాలతో అతిషి ఢిల్లీ ప్రజలను మోసం చేయలేరని సచ్‌దేవ్ అన్నారు.

ఢిల్లీ మంత్రులు సత్యాగ్రహాలు, బెయిల్, జైలు, అవినీతిలో మునిగి తేలుతున్నారని ఆరోపించారు. అంతే కాకుండా మంత్రి నిరాహార దీక్షల గురించి మాట్లాడటం నవ్వు తెప్పిస్తుందని అన్నారు. ప్రజల సమస్యలను తీర్చడమే మంత్రి పని. అతిషి రెండు గంటల పాటు నిరాహార దీక్ష వేదిక వద్ద కూర్చిని వేదిక వెనకాల ఎయిర్ కండిషన్ గదిలో 18 గంటలు ఉంటున్నారని అన్నారు. ఆప్ నేతలు అసమ్మతిని సహించలేరని తెలిపారు. ఢిల్లీ ప్రజలు వారిని ఎప్పటికీ క్షమించలేరని అన్నారు.

Advertisement

Also Read: మాఫియా చేతుల్లో విద్యా వ్యవస్థ: ప్రియాంక గాంధీ

సత్యాగ్రహం అనేది మహాత్మ గాంధీ లాలాలజపతి రాయ్ వంటి నాయకులు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ప్రారంభించిన పవిత్రమైన ఉద్యమం అని అన్నారు. అలాంటి ఉద్యమాన్ని అతిషి ఐదు నక్షత్రాల ఉద్యమం చేశారని ఎద్దేవా చేశారు. ఫైవ్ స్టార్ సత్యాగ్రహం చేయడం ద్వారా అతిషి సత్యాగ్రహ ఉద్యమ పవిత్రతను అవమానించారని అన్నారు.

Tags

Related News

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

Big Stories

Advertisement
×