BigTV English

Keerthi Sagar : టాలీవుడ్ ఫేమస్ రైటర్ అనుమానాస్పద మృతి..

Keerthi Sagar : టాలీవుడ్ ఫేమస్ రైటర్ అనుమానాస్పద మృతి..
Advertisement
Keerthi Sagar : టాలీవుడ్ ఫేమస్ రైటర్ అనుమానాస్పద మృతి..


Keerthi Sagar : డబ్బు, పేరు, గుర్తింపు అనేవి ఒకసారి మనిషి ప్రాణాలను కాపాడలేకపోతాయి. ఎంత డబ్బు సంపాదించినా కూడా కొంతమంది జీవితాల్లో సంతోషం అనేది ఉండదు. కేవలం వారు డిప్రెషన్‌తోనే సావాసం చేస్తుంటారు. దాని కారణంగా ఆత్మహత్య లాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటికే సినీ పరిశ్రమలో ఇలాంటి ఆత్మహత్యలు ఎన్నో చోటుచేసుకున్నాయి. తాజాగా మరో సీనియర్ రైటర్ కూడా అనుమానస్పద రీతిలో మృతిచెందాడు.

టాలీవుడ్‌లో స్టోరీ రైటర్‌గా మంచి పేరు తెచ్చుకున్న కీర్తీ సాగర్ (50) తాజాగా అనుమానస్పద రీతిలో మృతిచెందాడు. తెలుగులో ఎన్నో వందల సినిమాలు.. ఆయన రాసిన కథతో తెరకెక్కినవే. కానీ గత కొంతకాలంగా రైటర్స్ విషయంలో పరిశ్రమలో పోటీ పెరిగిపోయింది. దీంతో సీనియర్ అయినా కూడా కీర్తీ సాగర్‌కు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. గత కొన్నేళ్లలో అయితే ఒక్క అవకాశం కూడా లేకపోవడంతో ఆయన మానసిక ఒత్తిడికి గురయినట్టు తెలుస్తోంది.


ఛాన్సులు లేక, మానసిక ఒత్తిడికి గురవ్వడం వల్లే కీర్తీ సాగర్ ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కానీ కీర్తీ సాగర్ మరణ వార్త తెలిసిన తర్వాత కూడా తన కుటుంబ సభ్యులు ఎవరూ మృతదేహాన్ని తీసుకోవడానికి రాలేదనే విషయం అందరినీ షాక్‌కు గురిచేసింది. కర్నూలు జిల్లాకు చెందిన కీర్తి సాగర్ చాలా కాలం క్రితమే హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడు. షేక్‌పేట్ పరిధిలో నివసించడం మొదలుపెట్టాడు. ఎన్నో హిట్ సినిమాలకు కథలు అందించిన రికార్డ్ కీర్తీ సాగర్ సొంతం.

గత కొంతకాలంగా ఛాన్సులు లేక డిప్రెషన్‌లో ఉన్న కీర్తీ సాగర్.. తాజాగా తను ఉండే ఇంటిపై విగతజీవిగా కనిపించాడు. ముందుగా తనను చూసిన తన స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు కీర్తీ సాగర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కీర్తీ సాగర్ డిప్రెషన్ వల్ల ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Related News

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Big Stories

×