BigTV English

Virender Sehwag : ఫారిన్ కోచ్‌లు కూడా పక్షపాతం చూపిస్తారు

Virender Sehwag : ఫారిన్ కోచ్‌లు కూడా పక్షపాతం చూపిస్తారు
Virender Sehwag : ఫారిన్ కోచ్‌లు కూడా పక్షపాతం చూపిస్తారు


ప్రతీ ఆటలో ప్లేయర్స్, టీమ్స్ అందరూ.. బయటికి బాగానే కనిపించినా వారి మధ్యలో ఎప్పుడూ ఏదో ఒక కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా క్రికెట్‌లో ఇలాంటి కోల్డ్ వార్స్‌కు స్థానం ఎక్కువగా ఉంటుంది. కేవలం ప్లేయర్స్ మధ్యలోనే కాదు.. టీమ్స్ మధ్య కూడా ఇలాంటివి సహజం. కానీ కొన్నిసార్లు కోచ్‌ల మధ్య కూడా కోల్డ్ వార్ అనేది ఉంటుందని క్రికెట్ నిరూపించింది. తాజాగా ఆస్ట్రేలియన్ కోచ్.. గ్రెగ్ ఛాపెల్‌పై మరోసారి ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్స్ చేశాడు సేహ్వాగ్.

మామూలుగా టీమిండియా కోచ్‌లు ఒక ప్లేయర్‌ను ఒకలాగా, మరొక ప్లేయర్‌ను మరొకలాగా చూస్తారని ఫ్యాన్స్ ఆరోపిస్తూ ఉంటారు. కానీ ఈ తేడాలు చూపించడం ఇతర టీమ్స్‌లో కూడా జరుగుతూ ఉంటాయి అంటూ వీరేంద్ర సేహ్వాగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఒకప్పుడు గ్రెగ్ ఛాపెల్.. సేహ్వాగ్‌కు కెప్టెన్సీ ఇస్తానని, రెండు నెలల తర్వాత టీమ్ నుండి తొలగించడం గురించి ఇప్పుడు తాను ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్ చేసినట్టుందని క్రికెట్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.


సేహ్వాగ్ ఇండియన్ క్రికెట్ టీమ్‌లో ప్లేయర్‌గా ఉన్నప్పుడు జాన్ రైట్ తర్వాత ఒక్కసారి కూడా టీమిండియాకు ఇండియన్ కోచ్ ఎందుకు లేడు అని పదేపదే బహిరంగంగా ప్రశ్నిస్తూ ఉండేవాడు. పక్షపాతమే దానికి కారణం అని తనకు తానే సమాధానం చెప్పుకునేవాడు. తన సీనియర్లు.. అప్పటి ఇండియన్ కోచ్‌లతో ఎక్కువ సమయాన్ని గడిపేవారని, దీంతో కోచ్‌లకు కొంతమంది ఫేవరెట్ ప్లేయర్లుగా మారేవారని, అందుకే ఎప్పుడే వారికే అవకాశాలు ఇచ్చేవారని సేహ్వాగ్ బయటపెట్టాడు.

టీమిండియాకు ఫారిన్ కోచ్ వస్తే.. అందరినీ సమానంగా చూసే అవకాశం ఉంటుందని సేహ్వాగ్ అనుకునేవాడని అన్నాడు. అయినా కూడా తన అభిప్రాయం తప్పుగా మారిందన్నాడు. గ్రెగ్ ఛాపెల్ తన కెప్టెన్సీ విషయంలో చేసిన విషయాన్ని మరోసారి గుర్తుచేసుకున్నాడు. అప్పటినుండి ఇప్పటివరకు సేహ్వాగ్, ఛాపెల్ మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఇప్పటికీ ఒకరిపై ఒకరు కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్ పాస్ చేసుకుంటూ, ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్స్ చేస్తూనే ఉంటారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×