E-Paper
Advertisement

Allu Arjun: పుష్ప రాజ్ తో పోటీపడుతున్న మహానటి.. రిస్క్ చేస్తున్నావ్ అమ్మడు

Allu Arjun: పుష్ప రాజ్ తో పోటీపడుతున్న మహానటి.. రిస్క్ చేస్తున్నావ్ అమ్మడు
Advertisement

Allu Arjun: సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే.. వేరే సినిమాల మేకర్స్ వాయిదాలు వేస్తూ ఉంటారు. పెద్ద హీరోలతో రిస్క్ ఎందుకు అని ఒకటి అయితే.. ఇంకొకటి ఆ హీరోలకు వారు ఇచ్చే గౌరవం. కానీ, కొన్నిసారు చిన్న సినిమాలు అయినా కూడా పెద్ద సినిమాలతో పోటీకి దిగుతుంటాయి. అందుకు కారణం కథపై నమ్మకం. ఏమో పెద్ద సినిమా కన్నా తమ సినిమా కథ నచ్చి ప్రేక్షకులు ఇటు రావచ్చు అనే ధీమా. చాలాసార్లు మేకర్స్ నమ్మకం నిజం అయ్యింది.

ఇక ఇప్పుడు కీర్తి సురేష్ కూడా అదే నమ్మకంతో ఉందని జనాలు మాట్లాడుకుంటున్నారు. అవును మరీ.. అమ్మడు పుష్ప రాజ్ కే ఎదురు వెళ్లడానికి రెడీ అయ్యింది మరి. అవును మీరు వింటుంది నిజమే.. పుష్ప 2 తో మహానటి పోటీపడడానికి సిద్దమయ్యింది. కీర్తి నటిస్తున్న చిత్రాల్లో రఘు తాత ఒకటి. సుమన్‌ కుమార్‌ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Advertisement

ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఆగస్టు 15 న రఘు తాత థియేటర్ లోకి వస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.అదే రోజున పుష్ప 2 రిలీజ్ కు సిద్దమవుతుంది. దాదాపు మూడేళ్ళుగా ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది. ఇప్పటికే పుష్ప 2 నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై హైప్ ను మరింత పెంచాయి. మొదటి నుంచి కూడా ఈ సినిమా రూ. 100 కోట్లు దాటి రికార్డులు సృష్టిస్తుందని చెప్తున్నారు. ఇక అలాంటి పాన్ ఇండియా సినిమాతో కీర్తి పోటీ పడి రిస్క్ చేస్తుందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఏ నమ్మకంతో కీర్తి ఈ సినిమాను ఆగస్టు 15 న రిలీజ్ చేస్తుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×