BigTV English
Advertisement

Lok Sabha Elections 2024: రేపే తుది దశ పోలింగ్.. ఈసారి ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారంటే.. ?

Lok Sabha Elections 2024: రేపే తుది దశ పోలింగ్.. ఈసారి ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారంటే.. ?

Lok Sabha Elections Phase 7: ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. చివరి దశ పోలింగ్ జూన్1 న జరగనుంది. ఈ దశ ఎన్నికలు ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. మొత్తం 57 లోక్‌‌సభ స్థానాల్లో 904 మంది అభ్యర్థులు  బరిలో ఉన్నారు.


ఏడో దశలో పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో ప్రధాని మోదీ బరిలో ఉన్న వారణాసి కూడా ఉంది. అంతే కాకుండా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, నటి కంగనా రనౌత్, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ తదితరులు పోటీ చేస్తున్నారు. శనివారం ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కేంద్రాలకు, భద్రతా సిబ్బందిని తరలించేందుకు ఎన్నికల సంఘం 13 ప్రత్యేక రైళ్లు, 8 హెలికాఫ్టర్లను రంగంలోకి దించింది.

ఉదయం7 గంటలకు ఓటింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఏడో విడత ఎన్నికల్లో భాగంగా పంజాబ్ లో 328 మంది, యూపీలో 144 మంది, బీహార్ 134, ఒడిశా 66, జార్ఖండ్ 52, హిమాచల్ ప్రదేవ్ 37, చండీగఢ్ లో 19 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.


ఏడో విడత ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులో మొదటిది ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి. ఆయనకు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ బరిలో దిగారు. 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మోదీ మరోసారి విజయ కేతనం ఎగురవేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో నియోజకవర్గం హిమాచల్ ప్రదేశ్‌లోని మండి. ఇక్కడ బాలీవుడ్  నటి కంగనా రనౌత్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు.

Also Read: వారణాసి ఓటర్లకు ప్రధాని మోదీ వీడియో సందేశం.. ఏమని రిక్వెస్ట్ చేశారంటే..?

మండి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ బరిలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో కాంగ్రెస్ అభ్యర్థి సత్యపాల్ సింగ్ తలపడుతున్నారు. అనురాగ్ ఠాకూర్ ఇక్కడ నుంచి ఇప్పటి వరకూ 3 సార్లు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

Related News

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Blood Flow ECMO: మరణించిన తర్వాత కూడా రక్త ప్రసరణ.. ఆసియాలో తొలిసారిగా ఎక్మో టెక్నిక్

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Big Stories

×