Keerthy Suresh : బోల్డ్ సీన్స్ కు సై.. తగ్గేదే లేదంటున్న కీర్తి సురేష్..

Keerthy Suresh : బోల్డ్ సీన్స్ కు సై.. తగ్గేదేలే అంటున్న కీర్తి సురేష్..

Keerthy Suresh
Share this post with your friends

Keerthy Suresh : మహానటి మూవీ తో టాలీవుడ్ లో యాక్షన్ తో నిజంగానే మహానటి గా గుర్తింపు పొందిన యాక్టర్ కీర్తి సురేష్. మహానటి మూవీ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో మంచి సాంప్రదాయమైన పాత్రలో కీర్తి సురేష్ ని చూడడానికి అభిమానులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే ఆ ఒక్క సినిమా కీర్తి సురేష్ ఇమేజ్ మొత్తాన్ని వేరే లెవెల్ కి తీసుకువెళ్ళింది. మూవీ తో మంచి గుర్తింపు అయితే వచ్చింది కానీ.. ఆ ఫేమ్ కారణంగా కీర్తి కేవలం కొన్ని రకాల పాత్రలకే పరిమితం కావలసి వచ్చింది.

ఎందుకంటే మహానటి మూవీ తర్వాత కీర్తి సురేష్ కి వచ్చిన పాత్రలన్నీ అలాంటివే. మంచి గ్లామరస్ రోల్స్ చేసే అవకాశం ఉన్న హీరోయిన్ అయినప్పటికీ.. కీర్తి సురేష్ కు మిగిలిన హీరోయిన్స్ లాగా గ్లామర్ షో తో దూసుకు వెళ్లే అవకాశం రాలేదు. అయితే రీసెంట్ గా వస్తున్న రూమర్స్ ప్రకారం కీర్తి బోల్డ్ సీన్స్ చేయడానికి డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో కీర్తి.. సమంత ను రోల్ మోడల్ గా తీసుకుంటుందా అని కొందరు భావిస్తున్నారు.

సమంత నటించడం మొదలుపెట్టిన రెండవ సినిమా నుంచి మంచి గ్లామర్ పాత్రలు చేస్తూ వచ్చింది. పెళ్లి తర్వాత కాస్త గ్లామర్ తగ్గించి పద్ధతిగా ఉండే రోల్స్ ఎంచుకునేది. అయితే సడన్‌గా ఏమైందో తెలియదు కానీ ఫ్యామిలీ మెన్-2 వెబ్ సిరీస్ లో బోల్డ్ సీన్స్ లో కనిపించింది. మరీ ముఖ్యంగా అందులో బెడ్రూం సీన్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు కీర్తి కూడా సమంత లాగే బోల్డ్ రోల్స్ చేయడానికి రెడీ అయిపోయింది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి ఈ ముద్దుగుమ్మ మంచి హాట్ రోల్ చేయబోతుందట.

పుష్ప మూవీలో సమంత ఐటమ్ సాంగ్ యూత్ ను ఏ రేంజ్ లో రెచ్చగొట్టిచ్చిందో అందరికీ తెలుసు. కీర్తి కూడా బాలీవుడ్ మూవీలో ఓ ఐటెం సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఇక దీనితో పాటుగా హిందీ బోల్డ్ వెబ్ సిరీస్ కి కూడా కీర్తి రెడీ అయినట్లు తెలుస్తోంది. మంచి యాక్షన్ థ్రిల్లర్ సీక్వెన్స్ లో సాగే ఈ సిరీస్ లో బోల్డ్ సీన్స్ కు కొదవే లేదట. మొత్తానికి కీర్తి కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ స్టార్ డమ్ ఉన్నప్పటికీ బాలీవుడ్ లో బోల్డ్ సీన్స్ చేయడానికి రెడీ అయిన హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. మరి కీర్తి సురేష్ చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో.. దీన్ని ఆమె అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Mokshagna New Look: ఎన్టీఆర్ బాట‌లో మోక్ష‌జ్ఞ‌.. అందుకేనా లుక్ మారింది!

Bigtv Digital

Yash: అల్లు అర్జున్‌ని ఫాలో అవుతున్న య‌ష్‌

Bigtv Digital

Bhola Shankar : ‘భోళా శంకర్’ సెట్‌ని సందర్శించిన దర్శకేంద్రుడు

Bigtv Digital

Avatar 2 Ticket Price : అవతార్ 2 టికెట్ ధర తెలిస్తే మైండ్ బ్లాకే!

BigTv Desk

Chandra Mohan Wife : చంద్రమోహన్ భార్య గురించి మీకు తెలుసా?

Bigtv Digital

Manchu Lakshmi: ఈ విషయాన్ని రచ్చ చేయొద్దు ప్లీజ్.. విష్ణు, మనోజ్‌ల గొడవపై లక్ష్మీ రియాక్షన్ ఇదే..

Bigtv Digital

Leave a Comment