E-Paper
Advertisement

Vijayashanthi : కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి.. కీలక పదవి దక్కే ఛాన్స్..!

Vijayashanthi : కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి.. కీలక పదవి దక్కే ఛాన్స్..!
Advertisement
Vijayashanthi latest news

Vijayashanthi latest news(Political news today telangana):

బీజేపీకి గుడ్ బై చెప్పిన విజయశాంతి తిరిగి కాంగ్రెస్‌ లో చేరారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఇటీవల విజయశాంతి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలి పదవితోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.రాజీనామా లేఖను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపారు.

బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించగా విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాషాయ పార్టీపై ఆమె ఆగ్రహంగా ఉన్నారు. ఆ సమయంలో తెలంగాణ వ్యతిరేకులతో వేదిక పంచుకోవాల్సి వచ్చిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈక్రమంలో ఆమె బీజేపీని వీడారు. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్‌లో చేరారు. ఆమెకు కీలక పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×