E-Paper
Advertisement

Raghu thatha: బడా సినిమాలతో పోటీకి సిద్ధమైన కీర్తి సురేష్.. ఆగస్టు 15 బరిలోకి ‘రఘుతాత’

Raghu thatha: బడా సినిమాలతో పోటీకి సిద్ధమైన కీర్తి సురేష్.. ఆగస్టు 15 బరిలోకి ‘రఘుతాత’
Advertisement

Raghuthatha Trailer: నటి కీర్తి సురేష్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అందం, నటన, డాన్స్‌తో మెప్పించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్‌లో ‘నేను శైలజ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తన ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్‌ అందుకుంది. ఈ మూవీలో తన అందంతో తెలుగు సినీ ప్రియుల్ని కట్టిపడేసింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఆమె సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ఏదైనా ఉందని అంటే అది ‘మహానటి’ అని చెప్పాలి.

ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ తన యాక్టింగ్‌తో దుమ్ము దులిపేసింది. ఆ పాత్రలో కీర్తి సురేష్‌ని తప్ప సినీ ప్రియులు, అభిమానులు ఇంకెవరినీ ఊహించుకోలేనంతంగా జీవించేసింది. థియేటర్లలో ఆమె చేసిన పాత్ర చూసి ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అలా ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చి పడ్డాయి. వరుసగా స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని కొట్టేసింది.

Advertisement

నానితో ‘దసరా’ చేసింది. ఈ మూవీలో తన యాక్టింగ్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అంతేకాకుండా పెళ్లి సమయంలో ఆమె వేసిన డాన్స్ అయితే సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అయింది. దీంతో ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది. ఆ తర్వాత మహేశ్ బాబుతో ఓ సినిమా చేసింది. అందులో ఆమె తన అందంతో కట్టిపడేసింది. కుర్రకారును సైతం మంత్రముగ్దులను చేసింది. అయితే ఆ తర్వాత కీర్తికి అవకాశాలు కరువయ్యాయి. ఇటీవలే ‘కల్కి’ సినిమాలో ప్రభాస్ నడిపిన ‘బుజ్జి’ కారుకు డబ్బింగ్ చెప్పి అందరినీ ఆకట్టుకుంది.

Also Read: ఆ హీరో కొడుకుకి గర్ల్ ఫ్రెండ్ గా మారిన కీర్తి సురేష్..

Advertisement

ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎలాంటి సినిమా ఆఫర్లు లేకపోయినా.. కోలీవుడ్‌లో మాత్రం పలు సినిమాలతో దూసుకుపోతుంది. అందులో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘రఘు తాత’. సుమన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచేందుకు మేకర్స్ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ అత్యంత ఆద్యాత్మికంగా ఉంది. కయల్విజి పాత్రలో పక్కింటి అమ్మాయిలా నటించిన కీర్తి తన యాక్టింగ్‌తో ఆకట్టుకుంది.

ట్రైలర్ ప్రకారం.. ఒక హిందీ రాని తమిళ అమ్మాయి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది.. వాటిని చివరికి ఎలా అధిగమించింది అనే కథాంశంతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఆగస్టు 15న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే ఆ రోజే డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్, ఆయ్, కమిటీ కుర్రోళ్లు వంటి సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. మరి అలాంటి సినిమాలతో పోటీ పడేందుకు కీర్తి సురేష్ ‘రఘు తాత’ సినిమాతో సిద్ధంగా ఉంది. చూడాలి మరి ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×