E-Paper
Advertisement

Keerthy Suresh: ఆ హీరో కొడుకుకి గర్ల్ ఫ్రెండ్ గా మారిన కీర్తి సురేష్..

Keerthy Suresh: ఆ హీరో కొడుకుకి గర్ల్ ఫ్రెండ్ గా మారిన కీర్తి సురేష్..
Advertisement

Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. తెలుగులో కీర్తి ఎక్కువ నాని తోనే నటించింది. నాని – కీర్తి కాంబోకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండనే చెప్పాలి. నేను లోకల్ తో వీరి కాంబో మొదలయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దీని తరువాత వీరు దసరాలో కనిపించారు.

నేను లోకల్ సమయంలోనే కీర్తి -నాని మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అప్పటినుంచి కీర్తి.. నాని వాళ్ళ ఇంటికి కూడా వెళ్లి వస్తుంది. ముఖ్యంగా నాని కొడుకు జున్నుతో ఆమెకు ఎంతో అనుబంధం ఉంది. జున్నుతో ఆదుకోవడం అంటే.. కీర్తికి చాలా ఇష్టం. ఈ విషయం ఆమె ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. తాజాగా ఒక తమిళ్ ఇంటర్వ్యూలో కీర్తి.. జున్నుతో ఉన్న రిలేషన్ ను నెమరువేసుకుంది.

Advertisement

” నాని కొడుకు జున్ను అంటే నాకు చాలా ఇష్టం. నన్ను తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాడు. నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్లినా.. జున్నును కలిసే వెళ్తాను. ఇప్పుడు జున్ను పెరిగాడు కానీ, తాను చిన్నతనంలో ఉన్నప్పుడు నాకు బర్త్ డే విషెస్ చెప్పిన తీరు ఇప్పటికీ నవ్వు తెప్పిస్తుంది. హ్యాపీ బర్త్ డే కిట్టీ అత్త అని వాయిస్ మెసేజ్ పెట్టాడు” అని చెప్పుకొస్తూ ఆ వాయిస్ క్లిప్ ను వినిపించింది.

అందులో ముద్దు ముద్దుగా జున్ను.. కిట్టీ అత్త.. హ్యాపీ బర్త్ డే.. మిస్ యూ.. సీ యూ అనే పదాలు పలకడం రాక.. మోసీ.. సీసీ అని చెప్పడం నవ్వు తెప్పిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే కీర్తి ప్రస్తుతం రఘు తాత అనే సినిమాలో నటిస్తుంది. ఇది కాకుండా రివాల్వర్ రీటా అనే సినిమాలో కూడా నటిస్తుంది. మరి ఈ సినిమాలతో కీర్తి ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×