BigTV English

Red Alert: ఢిల్లీకి రెడ్ అలర్ట్.. భారీ వర్షాల హెచ్చరిక

Red Alert: ఢిల్లీకి రెడ్ అలర్ట్.. భారీ వర్షాల హెచ్చరిక

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఢిల్లీ సహా దాని చుట్టుపక్కల ప్రాంతాలు(ఎన్‌సీఆర్)లో ఒక్కసారిగా వర్షం పడింది. తీవ్ర ఉష్ణోగత్రల నుంచి ఢిల్లీకి ఈ వానలు ఉపశమనాన్ని ఇచ్చాయి. అయితే, ఈ వర్షంతో సంబుపడిపోయే పరిస్థితి లేదు. భారత వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాత్రి 9 గంటల వరకు ఢిల్లీ అలర్ట్ జారీ చేసింది. ఇంతలోపు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.


ఢిల్లీని దట్టమైన మేఘాలు కమ్మేశాయి. నాలుగు సెక్టార్లలోనూ భారీ వర్షం పడే సూచనలు ఉన్నాయి. పిడుగులతో కూడిన వర్షం పడే చాన్స్ ఉన్నదని, వచ్చే రెండు గంటలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.

Also Read: ఏడుపు ఎందుకు సబితమ్మా..? చేవెళ్ల చెల్లమ్మా అని కాంగ్రెస్ పార్టీ ఆదరించినందుకా..??


అంతకు ముందు ఐఎండీ సాధారణ వర్షపాతం పడే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. సెంట్రల్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ, న్యూఢిల్లీ, సౌత్ ఢిల్లీ, సౌత్ ఈస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ సహా ఎన్సీఆర్‌లోని ఇతర ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం, మెరుపులు పడుతాయని సూచించింది.

జులైలో ఢిల్లీ సగటు ఉష్ణోగ్రతలు 35.8 డిగ్రీలుగా ఉన్నది. అయితే, హ్యుమిడిటీ అధికంగా ఉండటం కారణంగా వేడిమి 45.8 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉన్నంతగా ఫీల్ అయ్యేలా చేసింది. నమోదవుతున్న ఉష్ణోగ్రతల కంటే కూడా హ్యుమిడిటీ కారణంగా ఎక్కువ వేడిమిని ప్రజలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఐఎండీ తెలిపింది. మంగళవారం ఢిల్లీలో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. మరుసటి రోజే భారీ వర్షం కురిసింది.

Related News

Cloud Burst: అసలు క్లౌడ్ బరస్ట్ ఏంటి..? దీనికి గల కారణాలేంటి..?

Gold In Odisha: ఒడిషాకు ‘బంగారు’ పంట.. నాలుగైదు జిల్లాల్లో బంగారం గనులు

CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్

Rahul Gandhi: ఎలక్షన్ కమిషన్‌పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు.. సీఈసీ ఫైర్

National Highway: రూ.11వేల కోట్లతో నేషనల్ హైవే.. 20 నిమిషాల్లోనే ఎయిర్ పోర్టుకు..!

Rare disease: హడలెత్తిస్తున్న అరుదైన వ్యాధి.. పాపం చిన్నారి మృతి.. బీ అలర్ట్!

Big Stories

×