BigTV English

Kiran Abbavaram Engagement: ఘనంగా కిరణ్ – రహస్య నిశ్చితార్థం.. ఫొటోస్ వైరల్!

Kiran Abbavaram Engagement: ఘనంగా కిరణ్ – రహస్య నిశ్చితార్థం.. ఫొటోస్ వైరల్!
kiran abbavaram
kiran abbavaram

Kiran Abbavaram – Rahasya Gorak Engagement: టాలీవుడ్‌లో మరో యువ నటుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తనదైన శైలిలో, యాసతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న యువ నటుడు కిరణ్ అబ్బవరం.


ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నాడు. “రాజావారు రాణిగారు” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. ఇదే సినిమాలో హీరోయిన్‌గా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది రహస్య గోరఖ్. ఈ సినిమా వీరిద్దరికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. జంటగా వీరిద్దరు ఆన్ స్క్రీన్‌లో రొమాన్స్ చేశారు. ఇక ఆఫ్ స్క్రీన్‌లోను ఈ జంట ప్రేమించుకుంటున్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. కాని వీరిద్దరూ అధికారంగా తమ ప్రేమను ఎప్పుడూ అభిమానులకు చెప్పలేదు.


అభిమానులు ఊరుకోరు కదా.. కాగా, వీళ్లు ఇద్దరు షేర్ చేసిన ఫోటోల బ్యాగ్రౌండ్‌ లొకేషన్లు ఒకటే ఉండటంతో ఎలాగొలా వీరిద్దరి ప్రేమను కన్ఫర్మ్ చేశారు ఫ్యాన్స్. రీసెంట్‌గా కిరణ్ ఇంటి గృహ ప్రవేశ వేడుకలో పూలు గుచ్చుతూ కనిపించింది ఈ బ్యూటీ.

Also Read: ఈ రోజు టీవీల్లో మస్తు మజా అనిపించే సినిమాలు వచ్చేస్తున్నాయి.. ఇదిగో లిస్ట్

దీంతో ఈ విషయాన్ని తాజాగా ఈ జంట తమ రిలేషన్‌ను అధికారంగా బయటపెట్టేసింది. కిరణ్ అబ్బవరం, రహస్య గత ఐదేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట ఇటీవలే తమ పేరెంట్స్‌ని ఒప్పించి త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు.

ఈ జంట తాజాగా ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ జంట తమపై వచ్చిన వార్తలను నిజం చేశారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read: వార్ 2 సినిమాకు డేట్లు కేటాయించిన ఎన్టీఆర్.. ఏకంగా అన్ని రోజులా..?

ఇక పెళ్లికి సంబంధించిన తేదీలు, ఇతర వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని ఈ జంట పేర్కొంది. ఇక కేరీర్ పరంగా చూస్తే కిరణ్ అబ్బవరం ప్రస్తుతం దిల్ రూబా సినిమాతో పాటు 1970వ దశకం నేపథ్యంతో సాగే ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్రబృందం.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×