BigTV English

Jr NTR Dates for War 2: వార్ 2 సినిమాకు 60 రోజుల డేట్లు కేటాయించిన ఎన్టీఆర్!

Jr NTR Dates for War 2: వార్ 2 సినిమాకు 60 రోజుల డేట్లు కేటాయించిన ఎన్టీఆర్!

NTR war 2 update


Jr NTR allotted 60 Days for War 2 Movie: టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ రెండు పార్టులుగా రూపొందుతోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ లుక్ గ్లింప్స్ సినిమాపై ఫుల్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ మాస్ అండ్ రగ్గడ్ లుక్ అందరినీ కట్టిపడేసింది. దీంతో ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ అందాల బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. అలాగే మరో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే తారక్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

Also Read: అసభ్యకరంగా రష్మిక మరో డీప్‌ఫేక్ వీడియో.. తనకే ఎందుకు ఇలా జరుగుతోంది..

బాలీవుడ్‌‌లో ‘వార్ 2’ మూవీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాతోనే తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అందువల్ల ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా ‘వార్ 2’ రూపొందుతోంది.

ఎస్‌ఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోంది. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, శార్వరి హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. జాన్ అబ్రహం విలన్‌ పాత్రలో కనిపించనున్నాడు.

తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఎన్టీఆర్ సీన్స్ తెరకెక్కించేందుకు మేకర్స్ ఓ ప్రణాళికను రెడీ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనికోసం తారక్ దాదాపు 60 రోజుల డేట్స్‌ని కేటాయించాడని టాక్ వినిపిస్తోంది.

Also Read: NTR Character in War 2 : వార్ 2 స్టోరీలో ట్విస్ట్.. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటి బాసూ!

కాగా ఈ 60 రోజుల డేట్స్‌లో 30 రోజులు తన సోలో సీన్స్ కోసం కేటాయించనున్నారని.. మరో 30 రోజులు హృతిక్ రోషన్‌తో కలిసి ఉన్న సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అంతేకాకుండా వచ్చే నెల అంటే ఏప్రిల్ నుంచి ఈ మూవీ షూటింగ్ సెట్స్‌లోకి ఎన్టీఆర్ అడుగుపెట్టనున్నట్లు సమాచారం. కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ ‘రా ఏజెంట్‌’గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×