E-Paper
Advertisement

Kissik Talks Show : లేడీ యాంకర్స్ తో ఇబ్బంది పడ్డాను..ఆ ఒక్కటే బాధేస్తుంది… రవి ఎమోషనల్..

Kissik Talks Show : లేడీ యాంకర్స్ తో ఇబ్బంది పడ్డాను..ఆ ఒక్కటే బాధేస్తుంది… రవి ఎమోషనల్..
Advertisement

Kissik Talks Show : తెలుగు న్యూస్ ఛానల్ బిగ్ టీవీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ను కూడా అందిస్తుంది.. బిగ్ టీవీ నిర్వహిస్తున్న ప్రతి షో కి జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. ముఖ్యంగా కిస్సిక్ టాక్ షో విపరీతంగా ఆకట్టుకుంటుంది.. జబర్దస్త్ వర్ష యాంకర్ గా వ్యవహారిస్తుంది.. ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఈ షో కి ఇంటర్వ్యూ ఇచ్చారు.. అయితే వీళ్ళందరూ ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఎక్కువగా ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాల గురించి బయట పెట్టారు. తమ లైఫ్ లో ఎదుర్కొన్న అతికిష్టమైన పరిస్థితుల గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు.. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ షో కి రోజురోజుకీ ఆదరణ పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా బుల్లితెర యాంకర్ రవి గెస్ట్ గా వచ్చారు.. అందులో భాగంగా ఆయన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి, తన లైఫ్ ఇలా మారడాని గల కారణాలు, ఇండస్ట్రీలో ఎవరు ఎలాంటి వారు అన్న విషయాల గురించి వివరించారు.. అంతేకాదు రవి తన జీవితంలో మర్చిపోలేని సంఘటన ఒకటి ఉందని ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.. ఇంతకీ రవి ఎమోషనల్ అయినా ఆ సంఘటన ఏంటో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

లేడీస్ నన్ను మోసం చేశారు..

ఈ ఇంటర్వ్యూ లో రవి మాట్లాడుతూ.. ముందుగా తన కెరీర్ గురించి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి యాంకర్ గా ఎందుకు దూరం అయ్యారు అని వర్ష అడుగుతుంది. దానికి సమాధానం చెప్పాడు రవి.. ఒకప్పుడు చాలా ప్రాబ్లమ్స్‌ ఫేస్ చేశాను. నేను పని చేసిన లేడీస్‌తోనే నాకు ప్రాబ్లమైంది. నేనొక్కడినే ఆల్ ఫీమేల్ యాంకర్స్‌తో కలిసి యాంకరింగ్ చేశానని గర్వంగా చెప్పుకుంటాను. ఏ డైరెక్టర్‌కి, ఏ ప్రొడక్షన్ హౌస్‌కి.. నేను ఫలానా యాంకర్‌తో చేయనని చెప్పలేదు. చెప్పను కూడా. కొన్ని సార్లు నేను సెట్‌కి వెళ్లిన తర్వాత ఫీమేల్ యాంకర్ కూడా ఉందండి అని చెప్పేవాళ్లు. నేనసలు అవేమీ పట్టించుకునే వాడిని కాదు. పక్కన వాళ్లు ఉంటే చేయనని చాలా మంది చెబుతారు. కానీ నేను అలా కాదు, మనం ఎదగాలి.. వాళ్లు కూడా ఎదగాలి అని ఆలోచిస్తాను. ఇప్పుడున్న యాంకర్స్.. వాళ్లతో అయితే మేము చేయమని ధైర్యంగా చెప్పేస్తున్నారు.

Advertisement

Also Read : నిజం తెలుసుకున్న అభి.. టెన్షన్ లో పల్లవి.. అయ్యో.. అభి పరిస్థితి సీరియస్..

ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం ఇదే..?

ఇండస్ట్రీలో ఒకప్పుడు బాగా ఉన్నారే.. ఇప్పుడు ఇలా మారారు ఏంటి అనే భావన ఎవరికి రాదు.. వెనకాల మాటలు మాత్రం వేరేలా ఉంటాయి అని రవి తనకు జరిగిన చేదు అనుభవాల గురించి చెప్తూ ఎమోషనల్ అవుతాడు.. అయితే యాంకరింగ్ కి ఎందుకు దూరం అయ్యాడు అన్న విషయాల గురించి క్లారిటీ ఇచ్చాడు.. యాంకరింగ్ చేసే సమయంలో లైవ్ ఈవెంట్స్‌లో నేను డైలాగ్ చెప్పిన వెంటనే కో యాంకర్ డైలాగ్ అందుకోవాలి. అలా కాకుండా నా ముఖం వైపు చూస్తా ఉంటే షో నడవదు. అది లైవ్ షో. మళ్లీ వాళ్లే వెళ్లి.. నాకసలు ఛాన్సే ఇవ్వలేదు.. నన్ను తొక్కేస్తున్నారు అని చెప్పిన సందర్భాలు చాలా జరిగాయ్. అందుకే డ్యూయల్ యాంకరింగ్ చాలా కష్టం. ఒక షో బాగా ర్యాంక్ అవ్వాలని చెమటలు, బ్లడ్ పెట్టి మరీ కష్టపడతాం. అది అంతగా ర్యాంక్ అవదు. ఒక్కొటీ అసలు ఏం చేయకుండా భారీగా ర్యాంక్ అవుతుంది. ఇది మన చేతిలో ఉండదు కాబట్టి.. నిరాశకు తావివ్వకుండా మనకు తెలిసింది చేసుకుంటూ వెళ్లిపోవడమే.. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను.. ఇలానే బ్రతుకుతాను అని రవి చెప్పాడు. ప్రస్తుతం రవి ఎపిసోడ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. ఆయన ఎలాంటి విషయాల గురించి పంచుకున్నారు మీరు ఒకసారి చూసేయండి..

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×