E-Paper
Advertisement

Prasanth Varma : క్రేజీ అంటే ఇదే మామా… ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లో తమిళ్ స్టార్..

Prasanth Varma : క్రేజీ అంటే ఇదే మామా… ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లో తమిళ్ స్టార్..
Advertisement

Prasanth Varma : యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేసింది కొన్ని సినిమాలే. అందులో హనుమాన్ ఒక్కటే కాస్త చెప్పుకునే మూవీ. కానీ, ఈయనకు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. అంతే కాదు, ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న నటసింహం నందమూరి బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ కూడా ఈ యంగ్ డైరెక్టర్ చేతుల మీదుగానే అవుతుంది. ఇంతలా క్రేజ్ సంపాదించుకోవడానికి కారణం ఆయన నిర్మిస్తున్న సినిమాటిక్ యూనివర్స్ అనే చెప్పాలి. ప్రశాంత్ వర్మ సూపర్ హీరోస్ కాన్సెప్ట్‌తో ఈ యంగ్ డైరెక్టర్ ఓ ప్రపంచాన్నే సృష్టించబోతున్నాడు. ఈ యూనివర్స్ లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ యాడ్ అవ్వబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. కొంత మేర షూటింగ్ కూడా చేశారట. కానీ, ఏమైందో తెలీదు కానీ, రణ్వీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అయితే తాజాగా మరో వార్త వినిపిస్తుంది. ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఓ తమిళ్ హీరో యాడ్ కాబోతున్నాడట. ఆయన ఎవరో ఇప్పుడు చూద్ధాం…

PVCU (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) అని ప్రకటించి హనుమాన్ సినిమా చేయడంతో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పటి వరకు ఈ యూనివర్స్ లో హనుమాన్, అధీర, జై హనుమాన్ సినిమాలను ప్రకటించాడు. మరి కొన్ని సినిమాలు కూడా ఉంటాయని చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇప్పుడు నటసింహం నందమూరి బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ గా ఉండబోయే మూవీ కూడా ఈ యూనివర్స్ లోనే రాబోతుంది.

Karthi Prashant Varma
Karthi Prashant Varma
Advertisement

అయితే తాజాగా ఈ యూనివర్స్ లో మరో హీరో యాడ్ కాబోతున్నారట. ఆయన ఎవరో కాదు.. ఈ వారం “సత్యం సుందరం” అనే మూవీతో థియేటర్స్ లోకి వస్తున్న కార్తీ. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీకి ప్రశాంత్ వర్మ స్టోరీ చెప్పారట. అది PVCU (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) భాగంలోనేదట. ఆ స్టోరీ కార్తీకి కూడా బాగానే నచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ సందర్భంలో చెప్పారు. యూనివర్స్ లో భాగంగా ఓ స్టోరీని కార్తీకి చెప్పానని, అది ఆయనకు కూడా బాగా నచ్చిందని అన్నారు. ఆయన నుంచి వచ్చే రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. కథ వినే టైంలో అయితే హీరో కార్తీ సానుకూలంగా స్పందిచారట. ఒక వేళ ఈ కాంబో సెట్ అయితే బ్లాక్ బస్టర్ మూవీ వచ్చినట్టే అని అంటున్నారు సినీ అభిమానులు.

కాగా, కార్తీ లెటెస్ట్ గా నటించిన సత్యం సుందరం మూవీ ఈ నెల 28న థియేటర్స్ లోకి రాబోతుంది. కార్తీతో పాటు అరవింద్ స్వామి ఈ సినిమాలో నటించారు. ఈ మల్టీ స్టారర్ మూవీని జ్యోతిక – సూర్య నిర్మించారు. ఇద్దరి స్నేహితల కథతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేమ కుమార్ సీ డైరెక్టర్.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×