BigTV English

Earthquake Japan: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రత.. సునామీ హెచ్చరికలు!

Earthquake Japan: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రత.. సునామీ హెచ్చరికలు!

Tsunami warning in Japan after Earthquake: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమూదైందని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. అలాగే జపాన్ దీవులు ఇజు, ఐలాండ్‌లలో రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రత నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.


జపాన్ దీవులైన ఇజు, ఒగాసవారాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్ రాజధాని టోక్యోకు 600 కిలోమీటర్ల దూరంలోని తోరిషిమా ద్వీపంలో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. అయితే ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించింది. ఈ భూకంపం ప్రభావంతో ఒక మీటరు పరిధితో కూడిన సునామీ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ భూకంపం తమపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఐలాండ్ ప్రజలు చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా, భూకంపం ప్రభావంతో పెద్దగా ఎలాంటి ప్రకంపనలు చోటుచేసుకోలేదు. కానీ ఈ భూకంప తీవ్రత కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే హచిజో ద్వీపంలోని యానే జిల్లాలో దాదాపు 50 సెంటీమీటర్ల సునామీ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే కొజుషిమా, మియాకేజిమా, ఇజు ఒషిమా ద్వీపాలలో చిన్న అలలు వచ్చినట్లు చెప్పారు. సముద్ర నీరు ఒక్క మీటరు పైకి ఎగిసిపడినా.. సునామీ వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


Also Read: భీకర దాడులతో దద్దరిల్లిన లెబనాన్‌.. 356 మంది మృతి!

జపాన్‌లో వరుసగా భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. గత రెండు నెలల వ్యవధిలోనే చాలా భూకంపాలు సంభవించాయి. సెప్టెంబర్ నెలలో వరుసగా భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. వరుసగా సెప్టెంబర్ 21 వ తేదీన చిబా ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత రోజు సెప్టెంబర్ 22వ తేదీన ఎహిమ్‌లో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించగా.. సెప్టెంబర్ 23వ తేదీన తైవాన్ లో 4.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో జపాన్ ప్రజలు వణికిపోతున్నారు.

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×