BigTV English
Advertisement

Kriti Shetty: నక్కతోక తొక్కిన బేబమ్మ.. ఇప్పుడైనా సక్సెస్ అందుకుంటుందా ..?

Kriti Shetty: నక్కతోక తొక్కిన బేబమ్మ.. ఇప్పుడైనా సక్సెస్ అందుకుంటుందా ..?

Kriti Shetty.. కన్నడ బ్యూటీ కృతి శెట్టి (Kriti Shetty)ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీ సంపాదించుకొని, ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది. అలా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత కథల ఎంపిక విషయంలో కాస్త తడబడి వరుస డిజాస్టర్లు మూటగట్టుకుంది. దాదాపు ఈమె నటించిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. చివరిగా నాగచైతన్యతో మళ్ళీ జతకట్టింది. కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఆ సినిమా కూడా విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత శర్వానంద్ హీరోగా వచ్చిన మనమే అనే సినిమాలో అవకాశాన్ని అందుకున్న ఈమె ఆ సినిమాతో కూడా విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. దీంతో ఇండస్ట్రీ నుంచి దూరం అవుతుందని వార్తలు కూడా వినిపించాయి. దీనికి తోడు కోలీవుడ్లో సూర్య సరసన అవకాశాన్ని అందుకుంది అంటూ వార్తలు వినిపించినా ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందని వార్తలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో ఇక ఈమె ఫేడౌట్ అయిపోయిందని అందరూ అనుకున్నారు.


విశ్వక్ మూవీ లో కృతిశెట్టి..

అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోగా పేరు సొంతం చేసుకున్న విశ్వక్ సేన్ సినిమాతో మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ. కె.వి అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ 14వ చిత్రం గా రాబోతున్న #VishwakSen 14 చిత్రంలో హీరోయిన్ గా అవకాశాన్ని అందుకున్నట్లు సమాచారం. జాతి రత్నాలు సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న కె.వి అనుదీప్, ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రాన్ని పోస్టర్ తో సహా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫైర్ మీట్స్ ఫన్ .. ఇది నాన్ స్టాప్ లాఫ్ రియాక్ట్ మాస్ కా దాస్ అంటూ చిత్ర బృందం పోస్టర్ తో సహా కామెంట్ చేసింది.


ఇప్పుడైనా సక్సెస్ అవుతుందా..?

ఇకపోతే ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈమె ఇందులో నటిస్తున్నట్లు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించకపోయినా ఇందులో నటిస్తున్నట్లు వార్తలు రావడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా విశ్వక్ , అనుదీప్ కాంబినేషన్ అనగానే అప్పుడే విజయ పరంపర మొదలైంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తుండగా ఇప్పుడు అలాంటి మూవీలోకి అడుగుపెడితే తను కచ్చితంగా సక్సెస్ అవుతానని భావించిందో ఏమో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి కృతిశెట్టికి ఈ సినిమా ఏ విధంగా సహాయపడుతుంది. తన కెరీర్ కు మళ్ళీ పునాది వేస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ సినిమా హిట్ అయితే మళ్లీ కృతి శెట్టి తెలుగులో గట్టి కం బ్యాక్ లభించినట్లే అని చెప్పవచ్చు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×