BigTV English

Divvela Madhuri : పవన్ కల్యాణ్ పై ఆరోపణలు చేస్తే కేసు పెడతారా ? కోర్టులో చూసుకుంటా

Divvela Madhuri : పవన్ కల్యాణ్ పై ఆరోపణలు చేస్తే కేసు పెడతారా ? కోర్టులో చూసుకుంటా

Divvela Madhuri on pawan kalyan : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురి మరోసారి స్పందించారు. ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ పై తాను ఆరోపణలు చేసిన కారణంగానే తనపై అక్రమ కేసు మోపారని ఆమె అన్నారు.


ఇదో రాజకీయ కుట్ర అని ఆమె అభివర్ణించారు.  ఇది తప్పుడు కేసు అని, దీన్ని కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఈనెల 7న అందరి కార్యకర్తల మాదిరిగానే దువ్వాడ శ్రీనుతో కలిసి తాను తిరుపతి స్వామివారి దర్శనానికి వెళ్లానన్నారు.

అక్కడ తమను చూసిన కొంతమంది మీడియా ప్రతినిధులు తమ వెంట పరుగులు పెడుతూ ఫోటోలు తీశారన్నారు. మాఢ వీధుల్లో తిరుగుతున్న మమ్మల్ని ఫోటోలు తీసి తప్పుడు ప్రచారం చేశారని మాధురి ఆవేదన వ్యక్తం చేశారు. తాము మాఢ వీధుల్లో ఎలాంటి ఫోటోలు గానీ రీల్స్ గానీ ఇతర ఎటువంటి ఫ్రీ వెడ్డింగ్ షూటింగ్స్ గానీ చేయలేదని క్లారిటీ ఇచ్చారు.


మీకు దమ్ముంటే దువ్వాడ శ్రీనివాస్ ని ధైర్యంగా ఎదుర్కోండి, అంతేగానీ ఇలాంటి పిచ్చి వార్తలు రాయకండని మాధురి స్పష్టం చేశారు. తిరుమల మాఢ వీధుల్లో దువ్వాడ, మాధురి ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెత్త వార్తలు రాస్తున్నారని ఆమె మండిపడ్డారు.

న్యూస్ ఛానెల్స్ అనేవి నిజాలు చూపించాలి కానీ మీకు నచ్చినట్టు ఏది పడితే అది ఎలా రాస్తారని నిలదీశారు. నిజంగా మేము ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే ఆధారాలు చూపించండని సవాల్ చేశారు. తప్పుడు వార్తలు రాసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటానని హెచ్చరించారు.

అంతకుముందు ఆమె ఆంధ్రప్రదేశ్ ఉపమఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని, విడాకులు ఇవ్వకుండానే మరో మహిళను తల్లిని చేశారని అన్నారు.  దీంతో జనసైనికులు మాధురిపై భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే మాధురిపై కేసు నమోదైంది.

Also Read : మరో మారు తెరపైకి వచ్చిన శాంతి.. అతడిపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు..

 

 

 

 

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×