BigTV English

Kriti shetty: అలాంటి నిర్ణయం తీసుకున్న ఉప్పెన బ్యూటీ.. చేజేతులారా కెరీర్ ను నాశనం చేసుకుంటోందా..?

Kriti shetty: అలాంటి నిర్ణయం తీసుకున్న ఉప్పెన బ్యూటీ.. చేజేతులారా కెరీర్ ను నాశనం చేసుకుంటోందా..?

Kriti shetty:ప్రముఖ కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి(Kriti Shetty) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సనా (Bucchibabu sana) దర్శకుడిగా తొలి పరిచయంలో చేసిన సినిమా ఉప్పెన(Uppena). ఈ సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది కృతి శెట్టి. ఇదే సినిమాలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) కూడా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. ఇలా ముగ్గురు కొత్త వ్యక్తులతో తెరకెక్కిన ఉప్పెన సినిమా ఇండస్ట్రీ వద్ద సరికొత్త రికార్డులు తిరగరాసింది. రూ.100 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈమె చేసిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలింది. దీంతో ఈమెకు టాలీవుడ్ లో అవకాశాలు కరువైపోయాయి. అయితే అదే సమయంలో ఈమె టాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్పి కోలీవుడ్ కి వెళ్ళిపోయింది.


రిస్క్ చేస్తున్న కృతి శెట్టి..

అక్కడ వరుస సినిమాల్లో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటోంది. మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతోంది. ఈ క్రమంలోనే ఈమెకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే కృతి శెట్టి ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. అయితే అక్కడ హీరోయిన్ క్యారెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే ఇంత చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఆమె ఇక్కడ హీరోయిన్గా భారీ పాపులారిటీ అందుకొని , అక్కడ స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అటు సినీ సెలబ్రిటీలు ఇటు అభిమానులు, నెటిజన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఒక యంగ్ హీరోయిన్ స్పెషల్ సాంగ్స్ చేస్తే మళ్ళీ హీరోయిన్గా అవకాశాలు రావడం చాలా కష్టం. అందులోనూ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్ అంటే ఇక ఆలోచించాల్సిన విషయం అనే చెప్పాలి. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే కృతి శెట్టి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అందరూ రిస్క్ చేస్తున్నావేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.


డిసప్పాయింట్ అవుతున్న ఫ్యాన్స్..

ఇదే నిజమైతే మళ్లీ ఆమెకు హీరోయిన్గా అవకాశాలు వస్తాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు చేతులారా కెరియర్ స్పాయిల్ చేసుకుంటున్నావ్ అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏదిఏమైనా కృతి శెట్టి అక్కడ హీరోయిన్గా అవకాశాలు అందుకోవాలని స్పెషల్ సాంగ్స్ ఇప్పుడప్పుడే చేయవద్దని కూడా కోరుతున్నారు. మరి కృతి శెట్టి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం కృతి శెట్టి విషయానికి వస్తే తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోయినా కోలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటూ మంచి ఇమేజ్ దక్కించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ . ఈ నేపథ్యంలోనే మళ్లీ తెలుగులో అవకాశాలు అందుకోవాలని కూడా అభిమానులు సూచిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×