BigTV English

KTR with Gangavva : పొలం మధ్య లో మంత్రితో దావత్.. గంగవ్వా నువ్వు కేక అంటున్న నెటిజన్స్..

KTR with Gangavva : పొలం మధ్య లో మంత్రితో దావత్.. గంగవ్వా నువ్వు కేక అంటున్న నెటిజన్స్..

KTR with Gangavva : యూట్యూబ్ వంటల ఛానల్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న గంగవ్వ అందరికీ పరిచయస్తురాలే. చిన్న చిన్న వీడియోలతో తన ఛానల్ స్టార్ట్ చేసి సినిమా సెలబ్రిటీలను సైతం ఇంటర్వ్యూ చేసే రేంజ్కి ఎదిగింది గంగవ్వ. సక్సెస్ సాధించడానికి వయస్సు అడ్డంకి కాదు అని నిరూపిస్తూ ఈ ఏజ్ లో కూడా యూట్యూబర్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది.


బిగ్ బాస్ షో తర్వాత గంగవ్వ కు మంచి పాపులారిటీ వచ్చింది. ఈ క్రేజ్ తో పలు చిత్రాలలో కూడా గంగవ్వ నటించింది. గంగవ్వ మొదలుపెట్టిన మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ మీరు తెలుగు రాష్ట్రాలను బాగా పాపులర్ అయింది. గంగవ్వ హిడింబి టీం రొయ్యల బిర్యానీ దగ్గర నుంచి దగ్గుపాటి రానా కళ్ళు దావత్ వరకు బాగా వైరల్ అయ్యాయి. సెలబ్రిటీలను సైతం తన వంటతో మెస్మరైజ్ చేసే గంగవ్వ లేటెస్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇరు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి సంతరించుకున్న విషయం అందరికీ తెలిసిందే. వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి ప్రస్తుతం తెలంగాణ వాసులు ముక్కున వేలు వేసుకుంటున్నారు. అమ్మో గంగవ్వ నువ్వు ఇంత హడావిడి చేస్తావా అని షాక్ అవుతున్నారు. మరోపక్క ఎన్నికల ప్రచారాన్ని ఎంతో వైవిధ్యంగా ముందుకు తీసుకెళ్లిన ఆ మంత్రి తెలివితేటలని పొగుడుతున్నారు.ఈ నేపథ్యంలో మై విలేజ్ షో యూట్యూబ్ లో ఈసారి గంగవ్వ ఏ సెలబ్రిటీతో సందడి చేసిందో తెలుసా?


పచ్చని పంట పొలాల మధ్య తెలంగాణ మంత్రి కేటీఆర్ తో గంగవ్వ కోడి కూర వండించింది. మరోపక్క కేటీఆర్ టమాటాలు తరుగుతూ.. నాటుకోడి కూర ,బగారా రైస్ వండుతూ రైతుల కోసం,తెలంగాణ కోసం తమ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ పనుల గురించి బాగానే ముచ్చటించారు.పొలం మధ్యలో మంత్రితో దావత్ చేస్తూ ఎంజాయ్ చేశారు గంగవ్వ అండ్ టీమ్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో.. పలువురు ఈ వీడియో పై తమ కామెంట్స్ పెడుతున్నారు. ప్రచారం చేయడానికి వెరైటీ కాన్సెప్ట్స్ ఎంచుకొని ప్రజల్లోకి చర్చకు పోవడం కేటీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని పలువులు భావిస్తున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×