E-Paper
Advertisement

Kurchi Madathapetti: ఛీఛీ.. మహేష్ ఇంత దిగజారాడా అన్నారు.. కానీ, ఇప్పుడు

Kurchi Madathapetti: ఛీఛీ.. మహేష్ ఇంత దిగజారాడా అన్నారు.. కానీ, ఇప్పుడు
Advertisement


Kurchi Madathapetti: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి నుంచి ఈ గుంటూరు కారంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు కారణం మహేష్- త్రివిక్రమ్ కాంబో మూడోసారి రిపిట్ కావడం. మహేష్ కూడా ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు. అయితే.. త్రివిక్రమ్ కథను మలిచే విధానం అభిమానులను ఆకట్టుకోలేకపోయింది.

గుంటూరు కారం షూటింగ్ సమయంలోనే ఎన్నో వివాదాలను ఎదుర్కుంటూ వచ్చింది. హీరోయిన్ మారడం, డిఓపి మారడం.. షూటింగ్ లేట్ అవ్వడం.. ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోవడం.. ఇలా ఒకదాని తరువాత ఒకటి వస్తూ ఉన్న సమయంలో ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్ రిలీజ్ అయ్యింది. పైన వివాదాలన్నీ వదిలేసి.. ఈ ఒక్క సాంగ్ మీద విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఎవరో ఒక ముసలితాత.. తాగి ఒక యూట్యూబ్ ఛానెల్ లో చెప్పిన డైలాగ్ ఆ కుర్చీని మడతపెట్టి ***తే మెడలు విరుగుతాయి. ఇక అప్పట్లో ఈ డైలాగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ముసలి తాతను సెలబ్రిటీని చేసింది.

Advertisement

ఇక గుంటూరు కారంలో ఒక మాస్ సాంగ్ ఉండాలని అనుకున్నప్పుడు.. ఈ డైలాగ్ తో సాంగ్ ఉంటే బావుంటుంది.. జనాలకు ఎక్కుతుంది అని చిత్ర బృందం అనుకోని.. ముసలి తాతకు కొంత డబ్బు ఇచ్చి మరీ ఈ డైలాగ్ ను సినిమాలో పెట్టించారు. ఇక ఈ సాంగ్ రిలీజ్ అయ్యాకా.. అందరూ.. మహేష్, త్రివిక్రమ్ పై మండిపడ్డారు. ముఖ్యంగా మహేష్ ను అయితే.. ఛీఛీ ఇంతకు దిగజారుతాడా అని ట్రోల్ చేశారు. ఆ పదాలు వాడడానికి మహేష్ ఎలా ఒప్పుకున్నాడు. సాంగ్ రాయడానికి త్రివిక్రమ్ లో సత్తా లేదా.. ? అంటూ విమర్శించారు. కానీ, ఇప్పుడు అదే సాంగ్ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంటుంది. తాజాగా అమెరికాలో హ్యూస్టన్ లో జరుగుతున్న నేషనల్ బాస్కెట్ బాల్ గేమ్స్- NBA మ్యాచ్ మధ్యలో ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్ కు స్టెప్స్ వేసి అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మహేష్, శ్రీలీల స్టెప్స్, థమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఈ సాంగ్ నే సూపర్.. అలా ఉండాలి సాంగ్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×