BigTV English

Shocking Scene In Shopping Mall: ఒక్కసారిగా భారీ కుదుపు.. షాపింగ్ మాల్‌లో భయంకరమైన సీన్

Shocking Scene In Shopping Mall: ఒక్కసారిగా భారీ కుదుపు.. షాపింగ్ మాల్‌లో భయంకరమైన సీన్

 


Shocking Scene In Shopping Mall
Shocking Scene In Shopping Mall

Shocking Scene In Shopping Mall: సోషల్ మీడియా ఉంటే చాలు ప్రపంచంలోని నలుమూలల ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. ఒక్కసారి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ ఏం జరుగుతుందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇలా ప్రమాదాలు, వార్తలు, సెలబ్రిటీల వివరాలు, రీల్స్, వీడియోలు వంటి అనేక రకాలుగా ప్రస్తుతం సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలోనే మన దేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో జరిగిన ఘటనలు కూడా సోషల్ మీడియాలో మనకు క్షణాల్లోనే తెలిసిపోతున్నాయి. తాజాగా ఓ షాపింగ్ మాల్ లో జరిగిన ఘటన ప్రస్తుతం అందరిని భయబ్రాంతులకు గురిచేసింది. ఓ మహిళ షాపింగ్ మాల్ లోని ప్రశాంతమైన వాతావరణంలో షాపింగ్ చేసుకుంటుంది. ఈ తరుణంలో మాల్ లోని ఓ ఫ్లోర్ లో చుట్టూ తిరుగుతూ అన్నిటినీ చూస్తుంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ మాల్ ఒక్కసారిగా పెద్ద శబ్ధం వినపడింది. ఉన్నట్టుండి మహిళ ఉన్న చోట పెద్ద గుంత ఏర్పడింది. దీంతో ఆ గుంతలో మహిళతో పాటు అక్కడే ఉన్న దుస్తులు, బొమ్మలు పడిపోయాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.

ఉన్నట్టుండి షాపింగ్ మాల్ కూలి మహిళ పడిపోయిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటన తూర్పు చైనాలో వెలుగుచూసింది. మార్చి 23న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాల్ లోని గోడ దెబ్బతినడంతో నేల ఒక్కసారిగా కూలిందని మాల్ మేనేజర్ తెలిపారు. దీంతో ఒక్కసారిగా మహిళ భూమిలోకి పడిపోయింది. దీంతో మహిళకు ఫ్రాక్చర్ అయిందని మీడియా కథనాలు తెలిపాయి.


Also Read: ఒళ్లు గగుర్లు పొడిచే వీడియో.. ఇంట్లోకి దూసుకొచ్చి ఐదుగురిపై దాడి చేసిన చిరుత

మహిళతో పాటు మరో మాల్ సిబ్బంది కూడా ఒకరు భూమిలో పడిపోయినట్లు తెలిపారు. ఇద్దరు శిథిలాల మధ్యలో ఇరుక్కుపోయారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి మహిళ, సిబ్బందిలో ఒకరిని రక్షించి బయటకు తీశారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. అయితే గాయాలపాలైన వారికి తామే చికిత్స అందిస్తామని మాల్ మేనేజర్ తెలిపారు. కాగా, మాల్ కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×