Big Stories

IT Raids: వందల ఎకరాల భూములు.. ప్రభాస్‌తో బాలీవుడ్ సినిమా.. మైత్రీ నిర్మాతల హవా!?

sukumar-mythri-movie-makers

IT Raids: డబ్బుంటే ఎవరైనా ఏం చేస్తారు? ముందు బిజినెస్‌లో పెడతారు.. వచ్చిన లాభాలతో భూములు కొంటారు.. అంతేగా? మైత్రీ మూవీస్ నిర్మాతలు సైతం ఇదే పని చేశారు. హైదరాబాద్ శివార్లలో వందల ఎకరాల భూములు కొన్నారు. ఇందులో తప్పేముంది? అనుకోవచ్చు. ఉందంటున్నారు ఐటీ అధికారులు. ఆ ఆదాయానికి, ఆ పెట్టుబడులకు పన్ను ఎగ్గొట్టారనేది వారి ఆరోపణ. ముంబై బాలీవుడ్‌లో తీగ లాగితే.. హైదరాబాద్‌ నిర్మాతల డొంక కదిలింది. ఢిల్లీ నుంచి ఐటీ అధికారులు వచ్చి.. మైత్రీ మూవీస్ నిర్మాతలతో పాటు డైరెక్టర్ఱ సుకుమార్ పోగేసిన సంపదను బయటకు లాగుతున్నారు. రెండు రోజులుగా జరుగుతున్న తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయని తెలుస్తోంది.

- Advertisement -

మెయిన్‌గా మైత్రీ ప్రొడ్యూసర్లపైనే ఫోకస్ చేసింది ఐటీ. బాహుబలి స్టార్ ప్రభాస్‌తో.. పాన్ ఇండియా మూవీకి సిద్ధమైంది మైత్రీ మూవీస్. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో ఆ మేరకు ఒప్పందం చేసుకున్నారట. భారీ మొత్తంలో అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అయితే, ఇచ్చిన ఆ సొమ్మంతా లెక్కాపత్రం లేని హవాలా నగదే అంటోంది ఐటీ. ముంబై ఫైనాన్షియర్లు నుంచి, విదేశాల నుంచి నిధులు అరేంజ్ చేశారని అంటున్నారు. ఆ మేరకు ముంబైలోని ఫైనాన్షియర్ల ఇళ్లలో ఐటీ రైడ్స్ చేస్తే.. హైదరాబాద్‌లోని మైత్రీ మూవీస్ గుట్టు బయటకు వచ్చిందని చెబుతున్నారు.

- Advertisement -

ఇటీవల కాలంలో వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తోంది మైత్రీ సంస్థ. పుష్పతో సహా అంతకుముందు మంచి హిట్స్‌తో భారీగా లాభాలు మూటగట్టుకుంది. ఆ ఆదాయంతో హైదరాబాద్ శివార్లలో బినామీ పేర్ల మీద 200 ఎకరాలకు పైగా భూములు కొన్నట్టు ఐటీ భావిస్తోంది. ఆ మేరకు రెండురోజుల తనిఖీల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

పక్కా సమాచారంతోనే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. పుష్ప 2 నిర్మాణం కోసం 500 కోట్లు విదేశాల నుంచి వచ్చాయని అనుమానిస్తున్నారు. ఆర్బీఐ పర్మిషన్ లేకుండా హవాలా పద్దతిలో ఈ సొమ్మంతా తరలించి.. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వరుసగా స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీస్తోంది. డిస్ట్రిబ్యూషన్ కంపెనీని కూడా నడుపుతోంది. 150 కోట్లతో పుష్పను నిర్మించగా… దాదాపు 300 కోట్ల వసూళ్లు వచ్చినట్టు టాక్.

ఇక, ఐటీ రైడ్స్ మాటెలా ఉన్నా.. ప్రభాస్- సిద్ధార్థ్ ఆనంద్‌ల కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ రాబోతోందని తెలిసి డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

అటు, సుకుమార్‌ సైతం పలు చిత్రాలకు నిర్మాతగా ఉన్నారు. 2019లో 8 కోట్లు పెట్టి 3 అంతస్తుల విల్లా కొన్నారని చెబుతున్నారు. 11 కోట్లతో ఇంటీరియర్ డిజైనింగ్, 5 కోట్లతో ఇటాలియన్ మార్బల్, ఫర్నీచర్‌ చేయించారని అంటున్నారు. పుష్ప 1, 2 రెండు సిరీస్‌లకు గానూ సుకుమార్ 60 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. అంతకుముందు రంగస్థలానికి 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని అంటున్నారు. అయితే పారితోషికంలో కేవలం 10 శాతం మాత్రమే లెక్కలో చూపించినట్టు ఐటీ భావిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News