BigTV English

Case on Rajtarun : లావణ్య కేసులో ట్విస్ట్.. రాజ్ తరుణ్ పై కేసు నమోదు

Case on Rajtarun : లావణ్య కేసులో ట్విస్ట్.. రాజ్ తరుణ్ పై కేసు నమోదు

Raj Tarun Lavanya case news(Today tollywood news): రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య కేసులో మరో ట్విస్ట్.. రాజ్ తరుణ్‌పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ కొన్నాళ్ల క్రితం తనకు అబార్షన్ చేయించాడని లావణ్య ఫిర్యాదు చేసింది. అందుకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్‌తో పాటు.. తన దగ్గర ఉన్న ఆధారాలను పోలీసులకిచ్చారు. దీంతో రాజ్ తరుణ్‌పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు.


తాము పదేళ్లుగా కలిసే ఉన్నామనీ.. రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగా ఆడియోలు రికార్డ్ చేశాడనీ లావణ్య ఆరోపిస్తున్నారు. మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇదిలావుంటే.. ఉదయం లావణ్యపై మాల్వీ మల్హోత్రా ఫిలింనగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తన సోదరుడిని బెదిరిస్తుందని ఆరోపించారు.

Also Read : బిగ్ ట్విస్ట్‌, రాజ్‌తరుణ్‌ లవర్‌పై మాల్వీ ఫిర్యాదు


మాల్వీ మల్హోత్రా ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే లావణ్య నార్సింగ్ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తనకు అబార్షన్లు చేయించాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 170 ఫొటోలతో పాటు టెక్నికల్ ఎవిడెన్సులను, మెడికల్ రిపోర్టులను లావణ్య పోలీసులకు అందజేసింది. రాజ్ తరుణ్ పై పోలీసులు ఐపీసీ 493 సెక్షన్ తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు లావణ్య చేస్తున్న ఆరోపణలతో తనకేం సంబంధం లేదన్న రాజ్ తరుణ్.. తాజాగా తనపై నమోదైన కేసు విషయంలో ఏం సమాధానం చెబుతాడన్నది ఆసక్తిగా మారింది.

 

Tags

Related News

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Big Stories

×