BigTV English

Big Twist: బిగ్ ట్విస్ట్‌, రాజ్‌తరుణ్‌ లవర్‌పై మాల్వీ ఫిర్యాదు

Big Twist: బిగ్ ట్విస్ట్‌, రాజ్‌తరుణ్‌ లవర్‌పై మాల్వీ ఫిర్యాదు

Actress Malvi Malhotra Complaint On Rajtharun Lavanya In Filmnagar Policestation: టాలీవుడ్ హీరో గొడవ రోజుకొక మలుపు తిరుగుతోంది. అంతేకాదు కేసులు, ప్రెస్‌మీట్ల పర్వం కొనసాగుతోంది.అంతేకాదు గతకొద్దిరోజుల నుండి తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని రాజ్ తరుణ్‌పై లావణ్య అనే యువతి కేసు పెట్టింది.అంతేకాకుండా మరో హీరోయిన్‌తో రాజ్‌తరుణ్‌ రిలేషన్‌లో ఉన్నాడంటూ రాజ్ తరుణ్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది.


వీటిపై రాజ్ తరుణ్ కూడా రియాక్ట్ అయ్యారు.అవన్నీ అబద్దాలని కొట్టిపారేశారు.అంతేకాదు లావణ్య డ్రగ్స్ వాడుతూ..వేరే వాళ్ళతో రిలేషన్‌లో ఉండేదని తెలిపాడు.అయితే ఈ ఇష్యూలో హీరోయిన్ మాల్వి మల్హోత్రా పేరు తెరమీదకు రావడంతో బాగా వైరల్ అయింది.దీంతో కొన్ని రోజుల క్రితమే మాల్వి మల్హోత్రా లావణ్యపై ఫిర్యాదు చేసింది.ఇటీవల లావణ్య ప్రెస్ మీట్ పెట్టి మరీ రాజ్ తరుణ్,మాల్వి మల్హోత్రా పెళ్లి చేసుకోబోతున్నారని,మాల్వి హిమాచల్ ప్రదేశ్‌లో పొలిటికల్ ఫ్యామిలీకి చెందిందని,తనని చంపేస్తామని బెదిరించారని ఆరోపణలు చేసింది.

Also Read: త్రివిక్రమ్‌పై పూనమ్‌ కౌర్‌ కౌంటర్‌


దీంతో తాజాగా లావణ్యపై నటి మాల్వి మల్హోత్రా ఫిలింనగర్‌ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసింది. హీరోయిన్‌ మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ లవర్ లావణ్యపై ఫిర్యాదు చేసింది.తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని లావణ్య చేసినవన్నీ అబద్దపు ఆరోపణలు అని,తనే నా సోదరుడికి అనుచిత సందేశాలను పంపుతోంది అంటూ ఫిర్యాదు చేసింది.మల్హోత్రా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఫిలింనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మరి ఈ కేసుపై లావణ్య ఎలా స్పందిస్తుందో చూడాలి.ఇప్పటికే నార్సింగ్ పోలీసులకు రాజ్ తరుణ్,మాల్వీపై ఫిర్యాదు చేసిన లావణ్య మరోసారి కొన్ని ఆధారాలు,స్క్రీన్ షాట్స్‌తో ఫిర్యాదు చేసింది.ఇక మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ కలిసి తిరగబడరా సామి మూవీలో యాక్ట్ చేశారు.ఈ మూవీ జులై 19న రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఈ ఘటనతో వాయిదా పడేలా కనిపిస్తోంది.చూడాలి మరి వీరి గొడవ ఎంతవరకు దారితీస్తుందో.

Related News

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Big Stories

×