
Leo Movie OTT Release : తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ లియో. లోకేష్ కనకరాజు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19న దసరా సందర్భంగా గ్రాండ్ గా విడుదల అయింది. మొదటి రెండు రోజులు మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత వసూళ్ల పరంగా బాగా క్లిక్ అయింది. ఇప్పటికే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఈ మూవీ అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇంతకీ ఎప్పుడో .. ఎక్కడో తెలుసా?
దళపతి విజయ్.. తెలుగులో పెద్దగా పరిచయం అవసరం లేని తమిళ హీరో. ఇప్పటికే ఇతను నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్ అవ్వుతున్నాయి. విజయ్ సినిమాలకు టాలీవుడ్ లో కూడా వసూళ్లు వస్తున్నాయి. అందుకే మొన్న బాలయ్య సినిమాకి పోటీగా ధైర్యంగా దసరా బరిలోకి దిగ గలిగాడు. అయితే ఈ చిత్రంలో సెకండ్ హాఫ్ బాగా సాగదీసినట్లుగా ఉంది అన్న టాక్ వచ్చింది. అయినా వసూళ్లపరంగా దంచి కొట్టింది ఈ మూవీ. ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది.
నవంబర్ 16 నుంచి లియో మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు టాక్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే ఇంకా దీనిపై అధికారికంగా ఎటువంటి స్పష్టత లేదు. అయితే ఈ సినిమా నిడివి ఓటీటీలో మాత్రం కాస్తా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయంపై మూవీ డైరెక్టర్ లోకేష్ కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
థియేటర్లో విడుదలైన వెర్షన్ కు కొని మార్పులు చేసి ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు. థియేటర్స్‌లో ఈ మూవీ నిడివి 2 గంటల 45 నిమిషాలు.. లెంత్ సరిపోదు అనే ఉద్దేశంతో చాలా సన్నివేశాలను కట్ చేశారట. అయితే ఓటీటీ లో వస్తున్న సినిమా విడివి సుమారు 3 గంటల 6నిమిషాలు అని తెలుస్తుంది. మూవీలో మార్చిన సన్నివేశాలతోపాటు కొన్ని కొత్త సన్నివేశాలను కూడా ఆన్లైన్ స్ట్రీమింగ్ చేయబోయే సినిమాకి యాడ్ చేశారు.
Rajinikanth: బాలయ్య గురించి రజినీకాంత్ మాటల్లో.. ఫుల్ కామెడీ..