E-Paper
Advertisement

Naa Anveshana: అన్వేష్ కి లుకౌట్ నోటీసులు.. ఇక తప్పించుకోలేవ్!

Naa Anveshana: అన్వేష్ కి లుకౌట్ నోటీసులు.. ఇక తప్పించుకోలేవ్!
Advertisement

Naa Anveshana:ప్రపంచ యాత్రికుడు , నా అన్వేషణ వంటి యూట్యూబ్ ఛానల్స్ తో సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్ , యూట్యూబర్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నా అన్వేషణ అన్వేష్.. ప్రపంచ దేశాలను చుట్టేస్తూ అక్కడి విషయాలను ఫాలోవర్స్ తో పంచుకుంటూ లక్షల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి అన్వేష్ ఇటీవల హిందూ దేవీ దేవత మూర్తులపై, భారతదేశంపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇప్పుడు ఏకంగా లుక్ అవుట్ నోటీసులు అందుకోవడం సంచలనంగా మారింది. గతంలో స్త్రీల బట్టల విషయంపై హీరో శివాజీ చేసిన కామెంట్లకు కౌంటర్గా హిందూ దేవీ దేవత మూర్తులను అసభ్యకర పదజాలంతో అన్వేష్ రెచ్చిపోయాడు. అప్పటివరకు ఎవరైతే అన్వేష్ కి సపోర్ట్ గా నిలిచారో.. ఈ ఒక్క ఘటనతో ఒక్కసారిగా దూరమయ్యారు. చాలామంది అతని సోషల్ మీడియా ఖాతాను అన్ ఫాలో చేయడం మొదలుపెట్టారు.

లుక్ అవుట్ నోటీసులు ఇచ్చేవరకు నిద్రపోను – కరాటే కళ్యాణి

పైగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పలువురు ఫిర్యాదులు చేయగా.. కేసు నమోదు చేసి అతని కోసం పోలీసుల వేట కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రీసెంట్గా అన్వేషో ఇంస్టాగ్రామ్ కనిపించకుండా పోయింది. దాంతో ఇన్స్టా బ్యాన్ అయ్యిందని అందరూ అనుకున్నారు. దీనిపై అన్వేష్ స్పందిస్తూ ఒక వీడియో కూడా విడుదల చేశాడు. ఇన్స్టా పోతే పోయింది.. దానివల్ల రూపాయి ఉపయోగం లేదు అంటూ వీడియో రిలీజ్ చేసి.. ఆ తర్వాత కొత్త పాస్పోర్ట్ కోసం ఇన్స్టా డీ ఆక్టివేట్ అయిందని అసలు విషయం చెప్పాడు. ఇలా విదేశాలలో ఉంటూ హిందూ దేవీ దేవత మూర్తులను కించపరుస్తూనే.. ఏకంగా భారతదేశంపై, భారత సంస్కృతిలపై అతను చేస్తున్న కామెంట్లకు మండిపడ్డ కరాటే కళ్యాణి (Karate Kalyani) అతడిని ఇండియాకు రప్పించే వరకు నిద్రపోనని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అన్వేష్ కి పంజాగుట్ట పోలీసులు నుంచీ లుక్ అవుట్ నోటీసులు..

Advertisement

ఇప్పటికే అతడిపై పలుమార్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆమె ..ఇటీవల ఇన్స్టా బ్లాక్ అవ్వడం పై స్పందిస్తూ.. అన్వేష్ ను ఇండియాకు రప్పించేంతవరకు తాను నిద్రపోనని.. మరో రెండు రోజుల్లో నీపై లుక్ అవుట్ నోటీసులు ఇప్పిస్తానని హెచ్చరించింది. అయితే ఇప్పుడు ఆ కామెంట్లు నిజమయ్యాయని తెలుస్తోంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నా అన్వేషణ అన్వేష్ కి పంజాగుట్ట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. మరో ఇంస్టాగ్రామ్ అకౌంట్ తో పాటు యూట్యూబ్ కి కూడా పంజాగుట్ట పోలీసులు లేఖ రాయనున్నారు. త్వరలోనే అన్వేష్ కి సంబంధించిన అన్ని ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ సోషల్ మీడియా ఖాతాలను క్లోజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే అన్వేష్ కి లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇక ఇండియా నుంచి ఈయన బయటకు వెళ్లే ప్రసక్తి లేదు అని చెప్పాలి.

ALSO READ:Tamannaah Bhatia: నటనపైనే ఆధారపడితే ఇబ్బందులు తప్పవు.. తమన్నా ఊహించని కామెంట్స్!

తప్పించుకోవడం కష్టమే..

Advertisement

సాధారణంగా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు అంటే దేశం విడిచి వెళ్లిపోకూడదు. కాబట్టి అన్వేష్ కి ఇక తప్పించుకునే ఆస్కారమే లేదని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికైనా ఇతడిలో మార్పు రావాలి అని ఫాలోవర్స్ కోరుకుంటున్నారు. మొత్తానికైతే నా అన్వేషణ అన్వేష్ కి లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×